Chennai : ఇన్‌‌స్టంట్ నూడుల్స్‌‌లాగా తక్షణ న్యాయం ఆశిస్తున్నారు

న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరమని, చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు...తక్షణ న్యాయం అనే డిమాండ్స్ పెరుగుతోందని ఈక్రమంలో నిజమైన న్యాయం దెబ్బతింటుందని ప్రజలు గుర్తించడం లేదన్నారు...

Chennai : ఇన్‌‌స్టంట్ నూడుల్స్‌‌లాగా తక్షణ న్యాయం ఆశిస్తున్నారు

Cji

Instant Justice – CJI : ఇన్ స్టంట్ నూడుల్స్ లాగా తక్షణ న్యాయం కావాలని ప్రజలు ఆశిస్తున్నారని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరమని, చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు. కానీ.. న్యాయవ్యవస్థతో సహా అన్ని సంస్థలపై ప్రజల విశ్వాసం ప్రభావితం చేయడం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్పునివ్వడం అంత తేలిక పని కాదని, తక్షణ న్యాయం అనే డిమాండ్స్ పెరుగుతోందని ఈక్రమంలో నిజమైన న్యాయం దెబ్బతింటుందని ప్రజలు గుర్తించడం లేదన్నారు. 2022, ఏప్రిల్ 23వ తేదీ శనివారం చెన్నైలో మద్రాస్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More : Central Govt : రెచ్చ‌గొట్టే, త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేయొద్దు.. టీవీ చాన‌ళ్ల‌పై కేంద్రం సీరియ‌స్

నమక్కల్, విల్లుపురం జిల్లాల్లో కోర్టు భవనాలను కూడా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలో వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయని, న్యాయవ్యవస్థకు బృహత్తరమైన రాజ్యాంగ బాధ్యత ఉందని తెలిపారు. న్యాయమూర్తులు సామాజిక అవగాహన కలిగి ఉండాలని, మారుతున్న సామాజిక అవసరాలు.. అంచనాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు. కోర్టుల్లో స్థానిక భాషల వినియోగానికి ప్రధాన న్యాయమూర్తి మొగ్గు చూపారు. తమ తమ కేసుల్లో ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుందో.. అర్థం చేసుకోవడం అవసరమని, చాలా మందికి అర్థం కావడం లేదని.. పెళ్లిల్లో మంత్రాలు వల్లించినట్లు ఉండకూడదన్నారు. రాజ్యాంగంలోని 348 ఆర్టికల్ ప్రకారం హైకోర్టుల్లో జరిగే విచారణల్లో స్థానిక భాషను అనుమతించాలని వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వచ్చాయన్నారు. ఈ అంశంపై చాలా చర్చలు జరిగినట్లు సీజేఐ ఎన్వీ రమణ.