తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే

  • Published By: madhu ,Published On : May 8, 2020 / 01:31 AM IST
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ రెండో వారంలో ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జవాబు పత్రాల కోడింగ్‌ 2020, మే 07వ తేదీ గురువారం నుంచి అధికారులు ప్రారంభించారని,. మే 12వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు.

53,10,543 జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉందని, అవన్నీ ఈనెల 30వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. జూన్‌ రెండో వారంలో ద్వితీయ సంవత్సర ఫలితాలను, మూడో వారంలో ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. మొదట ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనాన్నే చేపడతామన్నారు. 

కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా.. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా తెలిపారు.  ప్రతి కేంద్రంలో రోజూ 600 నుంచి 700 మంది మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

మరోవైపు స్కూళ్లను ఎప్పటి నుంచి తెరవాలనే దానిపై దృష్టి సారిస్తున్నామని, లాక్ డౌన్ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అన్ని ప్రైవేటు స్కూళ్లు పాటించాలన్నారు.  ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల నుంచి గతేడాది ఫీజులే వసూలు చేయాలని ఆదేశాలిచ్చామని గుర్తు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ 33 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో రోజూ 600 నుంచి 700 మంది మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read | 36 కేంద్రాల్లో ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్