ఇదో కొత్త ట్రెండ్: పోర్న్ స్టార్లకు డబ్బులిచ్చి వారితో మాజీ ప్రియులను తిట్టిస్తున్నారు!

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 08:28 AM IST
ఇదో కొత్త ట్రెండ్: పోర్న్ స్టార్లకు డబ్బులిచ్చి వారితో మాజీ ప్రియులను తిట్టిస్తున్నారు!

బ్రేకప్.. ఇప్పట్లో ఇది కామన్. చాలామంది తమకు నచ్చినవారితో కలిసి డేటింగ్ చేయడం తేడాలచ్చి బ్రేకప్ చెబుతుంటారు. అప్పటివరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంటలు అభిప్రాయబేధాలతో విడిపోతుంటారు. ఇలా విడిపోయిన చాలామందిలో తమ మాజీలపై పీకల్దాకా కోపం ఉంటుంది. తనను ఇబ్బంది పెట్టిన ప్రియుడిని ఎలాగైనా ఇరుకున పెట్టాలని చూస్తుంటారు. బ్రేకప్ తర్వాత మరొకరితో కలిసి డేటింగ్ చేస్తున్న మాజీ ప్రియుడిని చూసినప్పుడల్లా తమ పట్ల అతడి ప్రవర్తన గుర్తుకొచ్చి ఆగ్రహంతో ఊగిపోతుంటారు.

తనపై కోపాన్ని ఎలా తీర్చుకోవాలా? అని ఆలోచిస్తుంటారు. అలా పుట్టిందే.. #SpitePorn (స్పైట్ పోర్న్) ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యేకించి తమ మాజీలను అవమానించేందుకు పోర్న్ స్టార్లకు డబ్బులు చెల్లించి మరి తిట్టిస్తున్నారు. మాజీలను పోర్న్ స్టార్లు తిడుతుంటే.. అలా ఆనందపడుతూ తమ కసిని తీర్చుకుంటున్నారట. ఈ కొత్త ట్రెండ్ ‘స్పైట్ పోర్న్’ Allie Eve Knox అనే పోర్న్ స్టార్‌‌‌తోనే మొదలైంది. 

ఈమె క్యామ్ గర్ల్ కూడా.. ఎవరైతే తమ మాజీలతో వేధింపులకు గురవుతారో ఆ బాధిత మహిళలంతా పోర్న్ స్టార్లకు పేమెంట్ ఇచ్చి మరి తిట్టిస్తున్నారు. ఇందుకోసం కస్టమ్ వీడియోలను క్రియేట్ చేస్తారు. ఇలాగే ఒక బాధిత మహిళ తన మాజీ ప్రియుడితో బ్రేకప్ అయ్యాక అతడిపై కోపాన్ని ఇలా పోర్న్ స్టార్ Knoxతో తిట్టించింది. ఇదే విషయాన్ని Knox తన ట్విట్టర్ ద్వారా రివీల్ చేసింది. తన మాజీ ప్రియుడికి బుద్ది చెప్పాలని ఓ మహిళ కోరినట్టు తెలిపింది. నాక్స్ షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్యామ్ క్లిప్ మాదిరిగానే ప్రారంభం అవుతుంది. 

మూడు నిమిషాల పాటు Knox తనదైన శైలిలో మాటలతో ఆకట్టుకుంటుంది. నీకో చిన్న సీక్రెట్ చెబుతాను.. నీకో చిన్న సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను.. మీ మాజీ భార్యకు నేను స్నేహితురాలని అంటూ పెద్దగా నవ్వుతూ స్టూపిడ్ అంటూ తిట్టిపోసింది. తమ మాజీ ప్రియులతో బ్రేకప్ అయినవారంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా Knoxకు రిక్వెస్టులు పెడుతున్నారు. దీనికి స్పైట్ పోర్న్ అనే పేరు పెట్టేశారు. బ్రేకప్ అయినవారంతా తమ మాజీలను తిట్టించేందుకు పోర్న్ స్టార్లకు డబ్బులు చెల్లించేందుకు క్యూ కట్టేస్తున్నారు. 

Read: లాక్‌డౌన్‌లో లవర్‌ని కలవటానికి అమ్మాయి గెటప్..సూరత్ పోరడి వీరప్రేమ గాథ