Juhi Chawla : మేము ఓడినా.. మనసులు గెలిచాం, కొండంత ఆత్మవిశ్వాసాన్ని సాధించాం

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. భారీ టార్గెట్ ముందున్నా.. కేకేఆర్ రెచ్చిపోయి ఆడింది. తొలుత వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగింది. పరుగుల వరద పారించింది. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లో గెలుస్తుంది అనే నమ్మకాన్ని కలిగించింది. కానీ, ఈ మ్యాచ్ లో కో 18 పరుగులతో‌ కేకేఆర్ ఓడింది.

Juhi Chawla : మేము ఓడినా.. మనసులు గెలిచాం, కొండంత ఆత్మవిశ్వాసాన్ని సాధించాం

Juhi Chawla

Juhi Chawla Stands Firm With KKR : ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. భారీ టార్గెట్ ముందున్నా.. కేకేఆర్ రెచ్చిపోయి ఆడింది. తొలుత వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగింది. పరుగుల వరద పారించింది. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లో గెలుస్తుంది అనే నమ్మకాన్ని కలిగించింది. కానీ, ఈ మ్యాచ్ లో కో 18 పరుగులతో‌ కేకేఆర్ ఓడింది.

కేకేఆర్ ఓడినా ఆకట్టుకుంది. అభిమానుల హృదయాలు గెలుచుకుంది. చెన్నై విధించిన 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఒక దశలో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దినేష్‌ కార్తిక్‌, ఆండ్రీ రసెల్‌లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా రసెల్‌ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోగా.. కార్తిక్‌ కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రసెల్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్‌.. సిక్సర్లతో సీఎస్‌కే బౌలర్లను ఉతికారేస్తూ చుక్కలు చూపించాడు.

ఆఖరి 2 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన దశలో టెయింలెండర్లు వికెట్లు సమర్పించుకోవడంతో కమిన్స్‌ పోరాటం వృథాగా మారింది. అలా మొత్తం ఓవర్లు కూడా ఆడకుండానే 19.1 ఓవరల్లో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగులతో పరాజయం పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోయినా నెటిజన్ల మనుసులు మాత్రం గెలుచుకుంది. రసెల్‌, కార్తీక్‌, కమిన్స్‌ల ప్రదర్శనపై నెటిజన్లు తమ ప్రేమను ప్రదర్శిస్తూ కామెంట్లు చేశారు. కేకేఆర్‌ సహా యజమాని షారుఖ్‌ ఖాన్‌.. ”కేకేఆర్‌ బాయ్స్‌ మీరు సూపర్‌” అంటూ ట్వీట్‌ చేశాడు.

తాజాగా కేకేఆర్‌ మ్యాచ్‌ ఓటమిపై ఆ ఫ్రాంచైజీ సహ యజమాని జూహీ చావ్లా ట్విటర్‌ లో స్పందించారు. ‘కేకేఆర్‌ టీమ్‌ను చూస్తే గర్వంగా ఉంది. మా కుర్రాళ్ల ప్రదర్శన నిజంగా అద్బుతం. ఈరోజు మ్యాచ్‌ ఓడిపోయిండొచ్చు.. కానీ మనసులు గెలవడంతో పాటు కొండంత ఆత్శవిశ్వాసాన్ని సాధించాం. థ్యాంక్యూ.. రసెల్‌, కార్తిక్‌ , కమిన్స్‌.. మీ హార్డ్‌వర్క్‌ సూపర్‌.. మీ ఆటకు ఫిదా’ అంటూ కామెంట్‌ చేశారు.