IPL 2021 KKR Vs RCB : ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం.. బెంగళూరు ఔట్

ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ

IPL 2021 KKR Vs RCB : ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం.. బెంగళూరు ఔట్

Kolkata Beats Bangalore

IPL 2021 KKR Vs RCB : ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కోల్ కతా జట్టులో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 18 బంతుల్లో 29 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లో 26 పరుగులు రాణించారు. ఆ తర్వాత నితీశ్ రానా (25 బంతుల్లో 23 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసిన సునీల్ నరైన్ బ్యాటింగ్ లోనూ రెచ్చిపోయాడు. సునీల్ నరైన్ (15 బంతుల్లో 26 పరుగులు) ధాటిగా ఆడాడు. బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చహాల్, హర్షల్ పటేల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. క్వాలిఫయర్ -2లో కోల్ కతా జట్టు ఢిల్లీ కేపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ కి వెళ్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.

UPSC : బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు రేపే లాస్ట్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కీలక పోరులో బెంగళూరును కట్టడి చేశారు. బెంగళూరు బ్యాటర్లు తేలిపోయారు. ముఖ్యంగా సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. ఫెర్గుసన్ 2 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు టీమ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ పడిక్కల్ 21 పరుగులు చేశాడు. భరత్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. మ్యాక్స్ వెల్ (15) విఫలమయ్యాడు.