IPL 2021 KKR Vs SRH : హైదరాబాద్ పై కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేట్ మారలేదు. ఆ జట్టు మరో ఓటమిని మూటకట్టుకుంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. హైదరాబాద్ పై కోల్ కతా జట్టు 6 వికెట్ల తేడాతో

IPL 2021 KKR Vs SRH : హైదరాబాద్ పై కోల్‌కతా విజయం

Ipl 2021 Kkr Vs Srh

IPL 2021 KKR Vs SRH : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేట్ మారలేదు. ఆ జట్టు మరో ఓటమిని మూటకట్టుకుంది. కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. హైదరాబాద్ పై కోల్ కతా జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ విధించిన 116 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. స్వల్ప లక్ష్యమే అయినా.. కోల్ కతా చాలా కష్టపడాల్సి వచ్చింది.

కోల్ కతా జట్టులో ఓపెనర్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో(51 బంతుల్లో 57) మెరిశాడు. నితీష్ రానా(25) రాణించాడు. ఆఖర్లో డినేష్ కార్తిక్ (18) మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు.

Mercks Pill : ఈ ట్యాబ్లెట్‌తో కరోనాకు చెక్.. మరణాల ముప్పు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం సగానికి తగ్గుదల..!

కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. నిర్ణీత 20 ఓవర్లలో పడుతూ లేస్తూ ఆడిన సన్ రైజర్స్ 8 వికెట్లకు అతి కష్టమ్మీద 115 పరుగులే చేసింది. 26 పరుగులు చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులో టాప్ స్కోరర్. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులతో పర్వాలేదనిపించారు.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2, శివం మావి 2, వరుణ్ చక్రవర్తి 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.