IPL 2021- RR Vs DC Preview: ఎవరి బలమెంత? గెలిచేదెవరు?

IPL 2021- RR Vs DC Preview: ఎవరి బలమెంత? గెలిచేదెవరు?

Ipl 2021 Match 7 Rajasthan Royals Vs Delhi Capitals Match Preview

IPL 2021- ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపు మీద ఉండగా.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తలపడుతోంది. రెండు జట్లు కూడా.. ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడగా.. రాయల్స్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో రాయల్స్‌ జట్టు ఉండగా.. స్టోక్స్‌ లేకుండా రాయల్స్ ఆడుతోంది. గత ఐదు మ్యాచుల్లో గెలుపు ఢిల్లీదే కాగా.. వాంఖడేలో విజయం సాధించేందుకు రాయల్స్ కూడా కష్టపడుతుంది.

తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తరపున శిఖర్ ధావన్, పృథ్వీ షా కదం తొక్కగా.. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అద్భుతంగా ఆడాడు. రాజస్థాన్ ఆడిన తొలిమ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినా కూడా చివరిబంతి ఓటమి చవిచూసింది రాజస్థాన్ రాయల్స్. ఈ క్రమంలో ఏడవ మ్యాచ్ ఈరోజు రాత్రి 07:30 నుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. డేవిడ్ మిల్లర్ లేదా లియామ్ లివింగ్స్టోన్ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

పిచ్ నివేదిక:
ముంబైలోని వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. అధిక స్కోరింగ్ మ్యాచ్‌లను ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యాచ్‌లో మంచు కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

మ్యాచ్ అంచనా:
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని అంచనా ఉంది. బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ ఈ జట్టు బలంగా ఉండగా.. రాజస్థాన్ వరుస గాయాలతో కీలకమైన ప్లేయర్లను కోల్పోయింది.

ఢిల్లీ క్యాపిటల్స్(Probable XI): Shikhar Dhawan, Prithvi Shaw, Ajinkya Rahane, Rishabh Pant (c & wk), Marcus Stoinis, Shimron Hetmyer, Chris Woakes, Ravichandran Ashwin, Tom Curran, Amit Mishra, Avesh Khan

రాజస్థాన్ రాయల్స్(Probable XI): Jos Buttler, Manan Vohra, Sanju Samson (c, wk), David Miller, Riyan Parag, Rahul Tewatia, Shivam Dube, Shreyas Gopal, Chris Morris, Mustafizur Rahman, Chetan Sakariya