IPL 2022 Final Match : ఫైనల్‌లో గుజరాత్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్తాన్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ కు కుప్పకూలింది.

IPL 2022 Final Match : ఫైనల్‌లో గుజరాత్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన రాజస్తాన్

Ipl 2022 Final

IPL 2022 Final Match : ఐపీఎల్ 2022 సీజన్ 15 ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న తుదిపోరులో గుజరాత్ బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ కు కుప్పకూలింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ కు ఏదీ కలిసిరాలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టును గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. ఏ దశలోనూ భారీ స్కోరు సాధించేలా కనిపించని రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది.

Cricket Jersey: ఐపీఎల్‌ ఫైనల్ వేడుకలో అతిపెద్ద జెర్సీ లాంచ్

రాజస్తాన్ బ్యాటర్లలో.. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ జోస్‌ బట్లర్ (39.. 35 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. మరో ఓపెనర్ జైస్వాల్ ‌(16 బంతుల్లో 22 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ తప్ప మరెవ్వరూ రాణించలేదు. కెప్టెన్ సంజూ శాంసన్ 14, దేవదత్ పడిక్కల్ 2, హెట్మెయర్ 11, అశ్విన్ 6, రియాన్ పరాగ్ 15, బౌల్ట్ 11, మెక్ కాయ్ 8 పరుగులు చేశారు. దీంతో రాజస్తాన్‌ స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించిగలిగింది. బట్లర్ క్రీజులో ఉన్నంతసేపు ధీమాగా కనిపించిన రాజస్థాన్ రాయల్స్… అతడు ఔట్ కాగానే ఢీలా పడిపోయింది. బట్లర్ వికెట్ ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పడగొట్టడం విశేషం.(IPL 2022 Final Match)

గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో మెరిశాడు. సాయికిశోర్‌ రెండు వికెట్లు తీశాడు. రషీద్‌ఖాన్‌, యశ్ దయాళ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు. తుది పోరులో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అర్ధాంగి సోనాల్ షాతో కలిసి హాజరయ్యారు. సతీసమేతంగా మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించారు.

Amit Shah

Amit Shah

IPL 2022: తొలిసారి ఫైనల్ పోరుకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్

కాగా, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్ కు రావడం ఇదే తొలిసారి. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. అద్భుతమైన ఆటతో ఫైనల్ కు దూసుకొచ్చింది. కొత్త జట్టు అయినప్పటికీ చాలామంది అభిమానులను సంపాదించింది.

ఈ మ్యాచ్‌లో ఫ‌లితం ఎలా ఉన్నా అది రికార్డుగానే న‌మోద‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. గుజ‌రాత్ టైటాన్స్ గెలిస్తే… అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే టైటిల్ ఎగురేసుకుపోయిన జ‌ట్టుగా ఆ జ‌ట్టు రికార్డులకెక్కనుంది. అంతేకాకుండా తొలి సీజ‌న్‌లో టైటిల్ నెగ్గిన రాజ‌స్తాన్ జ‌ట్టుపైనే ఆ జ‌ట్టు విజ‌యం సాధించిన‌ట్ల‌వుతుంది.

అలా కాకుండా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధిస్తే… తొలి టైటిల్ నెగ్గిన 15 ఏళ్ల‌కు ఆ జ‌ట్టుకు రెండో టైటిల్ ద‌క్కిన‌ట్టవుతుంది. అంతేకాకుండా ఆ జ‌ట్టుకు టైటిల్ అందించిన షేర్ వార్న్ చ‌నిపోయిన ఏడాదే అత‌డికి నివాళిగా రాజ‌స్తాన్ ఈ టైటిల్‌ను అందించిన‌ట్టు అవుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఫ‌లితం ఎలా ఉన్నా అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

రాజస్తాన్ రాయల్స్ జట్టు..
జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దేవదత్‌ పడిక్కల్‌, హెట్‌మయర్‌, రియాన్ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజువేంద్ర చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్‌.

గుజరాత్‌ జట్టు:
వృద్దిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, సాయికిశోర్‌, యశ్‌ దయాళ్‌, ఫెర్గూసన్‌.