IPL2022 Bangalore Vs Punjab : బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం

బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరు పై ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది

IPL2022 Bangalore Vs Punjab : బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం

IPL2022 Bangalore Vs Punjab

IPL2022 Bangalore Vs Punjab : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరు పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ బ్యాటర్లు లియామ్ లివింగ్‌ స్టోన్‌ (70), బెయిర్‌ స్టో (66) దంచికొట్టడంతో.. పంజాబ్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది.

పంజాబ్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. బెంగళూరు బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్‌ (35), రజత్‌ పాటిదార్‌ (26), కోహ్లీ (20) మినహా బ్యాటింగ్‌లో ఎవరూ పెద్దగా రాణించలేదు. డుప్లెసిస్‌ 10, లామ్రోర్ 6, దినేశ్‌ కార్తిక్ 11, షాహ్‌బాజ్‌ 9, హర్షల్‌ పటేల్ 11* పరుగులు చేశారు.

IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు

పంజాబ్‌ బౌలర్లలో రబాడ మూడు వికెట్లు పడగొట్టాడు. రిషి ధావన్‌, రాహుల్‌ చాహర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో పంజాబ్‌ (12) పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. అంతేకాదు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కాగా, బెంగళూరు (14) 4 స్థానంలో కొనసాగుతోంది.

IPL2022 Bangalore Vs PBKS Punjab Kings Won On Bangalore By 54 Runs

IPL2022 Bangalore Vs PBKS Punjab Kings Won On Bangalore By 54 Runs

ఇక మే 19న గుజరాత్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధిస్తేనే బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కే అవకాశం ఉండగా.. పంజాబ్‌ మాత్రం మిగిలిన రెండింట్లోనూ గెలవాల్సి ఉంది. పంజాబ్‌కు ఢిల్లీ (మే 16), హైదరాబాద్ ‌(మే 22)తో మ్యాచ్‌లు ఉన్నాయి.

MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్‌ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, దినేశ్‌ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, షాహ్‌బాజ్‌ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

పంజాబ్‌ కింగ్స్ : జానీ బెయిర్‌ స్టో, శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, రిషి ధావన్, రాహుల్‌ చాహర్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.