IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణించింది.

IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన

Ipl2022 Chennai Vs Rr

IPL2022 Chennai vs RR : చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణించింది. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సంజూ సేన ప్లేఆఫ్స్ రెండో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ధోని సేన నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ‌(59) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్‌ (40) అదరగొట్టాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లోనే 40 పరుగులు చేసిన అశ్విన్.. రాజస్తాన్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. అశ్విన్ బ్యాటింగ్ లో మూడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి.

మిగతా బ్యాటర్లలో జోస్ బట్లర్ 2, కెప్టెన్ సంజూ శాంసన్ 15, దేవదత్ పడిక్కల్ 3, హెట్‌మైర్ 6, రియాన్‌ పరాగ్ 10* పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకి రెండు వికెట్లు పడగొట్టాడు. సిమర్‌జిత్, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.(IPL2022 Chennai vs RR)

Virat Kohli: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

రాజస్తాన్‌ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లకుగాను 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో రెండో స్థానానికి ఎగబాకింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించింది. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా రాజస్తాన్ రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు చెన్నై ఓటమితో ఇంటిముఖం పట్టింది. చెన్నై 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించింది.

Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా

చెన్నైతో పోరులో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో సీఎస్కే మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులే చేసింది.

చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93) అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఒంటరిపోరు సాగించాడు. మొయిన్ అలీ 57 బంతుల్లోనే 93 పరుగులు చేయడం విశేషం. ఇతర బ్యాట్స్ మెన్ విఫలమైనా, మొయిన్ మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించలేదు. ఈ ఇంగ్లండ్ ఆటగాడి స్కోరులో 13 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. మొయిన్ ఆలీ రాణించడంతో చెన్నై ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. రాజస్తాన్ కు 151 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

మొయిన్‌ అలీ కాకుండా కెప్టెన్ ఎంఎస్ ధోనీ (26), డేవన్‌ కాన్వే (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాటర్లలో రుతురాజ్‌ 2, జగదీశన్ 1, అంబటి రాయుడు 3, మిచెల్‌ సాంట్నర్ 1*, సిమర్‌జీత్ 3* పరుగులు చేశారు.

రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, మెక్‌కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్‌ చెరో వికెట్ తీశారు. పవర్‌ ప్లే లో 75 పరుగులు చేసిన చెన్నై.. మిగతా 14 ఓవర్లలో మరో 75 పరుగులను మాత్రమే చేయగలిగింది.