IPL2022 DC Beats MI : దడదడలాడించిన ఢిల్లీ.. ముంబైపై ఘనవిజయం

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ ఘనవిజయం సాధించింది. 178 పరుగుల భారీ టార్గెట్ ను మరో 10 బంతులు మిగిలి ఉండగానే..

IPL2022 DC Beats MI : దడదడలాడించిన ఢిల్లీ.. ముంబైపై ఘనవిజయం

Ipl2022 Dc Beats Mi

IPL2022 DC Beats MI : ఐపీఎల్ -2022 సీజన్ -15లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ముంబై నిర్దేశించిన 178 పరుగుల భారీ టార్గెట్ ను మరో 10 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ ఆరంభంలో తడబడినా.. ఆఖర్లో పుంజుకుని విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ 18.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

ఢిల్లీ బ్యాటర్లలో లలిత్ యాదవ్ రెచ్చిపోయాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 48 పరుగులు (2 సిక్సులు, 4 ఫోర్లు) చేసి జట్టు గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో అక్షర్ పటేల్ వీరవిహారం చేశాడు. 17 బంతుల్లోనే 38 పరుగులు బాదాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ వీరవిహారం చేయడంతో ఢిల్లీ కేపిటల్స్ ఈజీగా విజయం సాధించింది.(IPL2022 DC Beats MI)

IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

ఇక ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 38 పరుగులు.. రెండు సిక్సులు, 4 ఫోర్లు) రాణించాడు. టిమ్ సీఫెర్ట్ (21), శార్దూల్ ఠాకూర్ (22) పరుగులు చేశారు. మన్‌దీప్‌ సింగ్‌ (0) గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్ పంత్‌ (1) కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మిల్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ దగ్గర టిమ్‌ డేవిడ్ చేతికి చిక్కాడు. ముంబై బౌలర్లలో బసిల్ తంపి మూడు వికెట్లు తీశాడు. మురుగన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు. టైమల్ మిల్స్ ఒక వికెట్ తీశాడు.

IPL 2022 : సచిన్ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్ లతో సమానంగా ఇషాన్ కిషన్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ వీరబాదుడు బాదాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచిన ఇషాన్ కిషన్ మొత్తం 48 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. బౌలర్ ఎవరన్నది చూడకుండా, బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఇషాన్ కిషన్ ఆటతీరు కొనసాగింది.

Watch IPL 2022 Live Matches : భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఇలా చూడొచ్చు..!

కెప్టెన్ రోహిత్ శర్మ సైతం దూకుడు ప్రదర్శించాడు. రోహిత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేశాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ 8, తిలక్ వర్మ 22, కీరన్ పొలార్డ్ 3, టిమ్ డేవిడ్ 12 పరుగులు చేశారు. డేనియల్ శామ్స్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

ఇకపోతే ముంబై ఇండియన్స్ విషయంలో ఓటమి హిస్టరీ రిపీట్ అయ్యింది. మరోసారి ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచులో పరాజయం పాలైంది.

IPL 2022 : ఇషాన్ ఓపెనర్‌గా దిగితే హాఫ్ సెంచరీ బాదడం ఖాయం.. రికార్డులు ఇదిగో..