IPL2022 LSG Vs DC : దంచికొట్టిన రాహుల్, దీపక్ హుడా… ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దీంతో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి..
IPL2022 LSG Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దీంతో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (77), దీపక్ హుడా (52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. దీపక్ హుడా 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. ఢిల్లీ ఎదుట లక్నో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ డికాక్ 23, మార్కస్ స్టొయినిస్ 17*, కృనాల్ పాండ్య 9* పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కే మూడు వికెట్లు దక్కాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో లక్నో జట్టు 9 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ ఎనిమిది మ్యాచులు ఆడింది. నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఆరో స్థానంలో ఉంది.
ఈ రోజు మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే… పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. అదే లక్నో గెలిస్తే రెండో స్థానానికి చేరుకుంటుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా మీద గెలిచిన ఢిల్లీ ఆ ఊపును కొనసాగించాలని అనుకుంటోంది. లక్నో జట్టులో అవేశ్ ఖాన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ వచ్చాడు. ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
IPL2022 RCB Vs GT : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం..!
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, మొహిసిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా.
KL Rahul is our Top Performer from the first innings for his brilliant knock of 77 off 51 deliveries.
A look at his batting summary here ?? #TATAIPL #DCvLSG pic.twitter.com/CpX39QvoUr
— IndianPremierLeague (@IPL) May 1, 2022