IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే

Ipl2022 Punjabkings Vs Dc

IPL2022 PunjabKings Vs DC : ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది.

Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ

పంజాబ్‌ బ్యాటర్లలో జితేశ్ శర్మ రాణించాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌ స్టో 15 బంతుల్లో 28 పరుగులతో రాణించాడు. రాహుల్ చాహర్‌ (25*) పరుగులు చేశారు. వీరు పోరాడినా ఫలితం లేకపోయింది. శిఖర్ ధావన్‌ 16 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ (0) డకౌట్ కాగా.. లివింగ్ స్టోన్‌ (3), హర్‌ప్రీత్ (1), రిషి ధావన్‌ (4), అర్ష్‌దీప్‌ సింగ్ (2*) పరుగులు చేశారు.

Thakur

Thakur

ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. అక్షర్‌ పటేల్, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. నోర్జే ఒక వికెట్ తీశాడు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ 15లో పంజాబ్ కింగ్స్ పోరాటం ముగిసినట్టే. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మయాంక్‌ సేన చతికిలపడింది. తాజా గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గోల్డెన్ డక్ అయ్యాడు. మరో ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది.

ఢిల్లీ ఇన్నింగ్స్ లో వార్నర్ తొలి బంతికే ఔటయ్యాడు. పార్ట్ టైమ్ బౌలర్ లియామ్ లివింగ్ స్టోన్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన వార్నర్ క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 63 పరుగులు చేశాడు. మార్ష్ స్కోర్ లో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అటు, ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ధాటిగా ఆడాడు. సర్ఫరాజ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు సాధించాడు.

IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం

లలిత్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) లివింగ్ స్టోన్ బౌలింగ్ లో ఓ భారీ సిక్స్ బాది, ఆ తర్వాతి బంతికే స్టంపౌట్ అయ్యాడు. హార్డ్ హిట్టర్ రోవ్ మాన్ పావెల్ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ వికెట్ కూడా లివింగ్ స్టోన్ ఖాతాలోకే చేరింది.

ఓవరాల్ గా లివింగ్ స్టోన్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. రబాడాకు 1 వికెట్ దక్కింది.

జట్ల వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్‌, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్.

పంజాబ్‌ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌ స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేశ్‌ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌ దీప్‌ సింగ్‌.