IPL2022 Rajasthan Vs LSG : రాజస్తాన్ వర్సెస్ లక్నో.. రాహుల్ సేన టార్గెట్ ఎంతంటే..

తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో ముందు 179 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

IPL2022 Rajasthan Vs LSG : రాజస్తాన్ వర్సెస్ లక్నో.. రాహుల్ సేన టార్గెట్ ఎంతంటే..

Ipl2022 Rajasthan Vs Lsg

IPL2022 Rajasthan Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన రాజస్తాన్.. బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో ముందు 179 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రాజస్తాన్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు.

Hardik Pandya: ప్రపంచమంతా క్రికెట్ చూస్తోంది.. కెప్టెన్ సెన్సిబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం – షమీ

యశస్వి జైస్వాల్ 41, దేవదత్ పడిక్కల్ 39, కెప్టెన్ సంజూ శాంసన్‌ 32, రియాన్ పరాగ్ 19, నీషమ్‌ 14, అశ్విన్‌ 10*, ట్రెంట్ బౌల్ట్ 17* పరుగులు చేశారు. జోస్ బట్లర్‌ (2) విఫలమయ్యాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అవేశ్‌ఖాన్, జాసన్ హోల్డర్‌, ఆయుష్ బదోని చెరో వికెట్ తీశారు.

IPL2022 Rajasthan Vs LSG Lucknow Super Giants Target 179

IPL2022 Rajasthan Vs LSG Lucknow Super Giants Target 179

ఈ సీజన్ లో కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని లక్నో 12 మ్యాచులకుగాను ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాజస్తాన్ విషయానికొస్తే.. 12 మ్యాచులకుగాను ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఇందులో ఒక జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరొకటేమో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బెర్తు ఖాయమైపోతుంది.

IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : క్వింటన్ డికాక్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్‌ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జాసన్ హోల్డర్‌, మోహ్‌సిన్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేశ్‌ ఖాన్‌.

IPL2022 Rajasthan Vs LSG Lucknow Super Giants Target 179

IPL2022 Rajasthan Vs LSG Lucknow Super Giants Target 179

రాజస్తాన్‌ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, జేమ్స్‌ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ, చాహల్, మెక్‌కాయ్‌.