iQOO 10 Design : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో iQOO 10 సిరీస్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

iQOO నుంచి 10 సిరీస్ ఈ నెల జూలై 19న లాంచ్ ఈవెంట్ జరుగనుంది. కంపెనీ iQOO 10, iQOO 10 ప్రో అనే రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది.

iQOO 10 Design : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో iQOO 10 సిరీస్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

Iqoo 10 Design Officially Teased, Iqoo 10 Pro To Feature 200w Fast Charging (1)

iQOO 10 Design : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం iQOO నుంచి 10 సిరీస్ లాంచ్ కానుంది. ఈ నెల (జూలై) 19న లాంచ్ ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా కంపెనీ iQOO 10, iQOO 10 ప్రో అనే రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. అధికారిక లాంచ్‌కు ముందు.. కంపెనీ iQOO 10pro డిజైన్‌ను అధికారికంగా వెల్లడించింది. iQOO 10 Pro రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. రెండు కలర్లలో ఒకటి వైట్ BMW లెజెండ్ ఎడిషన్, వెనుక ప్యానెల్ కుడి వైపున రెడ్, బ్లూ, బ్లాక్ కలర్ షాడోలు ఉన్నాయి.

బ్లాక్ కలర్ డ్యూయల్-టోన్ వెనుక ఉంది. ఈ రెండు కలర్ ఆప్షన్లలో భారీ కెమెరా కలిగి ఉన్నాయి. ఎడమ వైపున దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. iQOO 10 Pro కెమెరా సెటప్‌లో 3 సెన్సార్లు ఉంటాయి. పుకార్ల ప్రకారం.. ఫోన్ గింబాల్ లాంటి 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇతర సెన్సార్ 50MP అల్ట్రావైడ్ కెమెరాగా ఉంటుంది. ఇక ప్రో మోడల్ 14.6MP పోర్ట్రెయిట్-టెలిఫోటో కెమెరాతో రానుందని భావిస్తున్నారు. కెమెరా మాడ్యూల్‌లోని టెక్స్ట్ ఫోన్‌కు 40x జూమ్ సపోర్ట్ చేస్తుందని నిర్ధారిస్తుంది. డిజిటల్, ఆప్టికల్ జూమ్‌తో ఉంటుందని ఆశించవచ్చు. LED ఫ్లాష్ కెమెరా మాడ్యూల్ బ్యాక్‌తో రానుంది. ఈ ఫోన్ పవర్ వాల్యూమ్ బటన్లలో రైట్ ఎడ్జ్ ఉంటాయని చెబుతున్నారు. USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ అంచున ఉంటాయని తెలుస్తోంది.

Iqoo 10 Design Officially Teased, Iqoo 10 Pro To Feature 200w Fast Charging

Iqoo 10 Design Officially Teased, Iqoo 10 Pro To Feature 200w Fast Charging

iQOO 10pro ఎగువ మధ్యలో హోల్-పంచ్ కటౌట్‌తో కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Weiboలోని టీజర్ వీడియో ఫోన్‌లో 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని వెల్లడించింది. మరోవైపు.. వనిల్లా మోడల్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. iQOO 10 Pro స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 SoC కలిగి ఉంటుంది. వనిల్లా iQOO 10 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ SoCని కలిగి ఉంటుందని చెబుతున్నారు.

రెండు ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. వనిల్లా మోడల్ Full HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉండగా.. iQOO 10 Pro 2K రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ రెండు డివైజ్‌లు Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రన్ అవుతున్నాయి. iQOO 10 Pro హుడ్ కింద 4700 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. దీని బరువు 216 గ్రాములు, 194.9 x 75.5 x 9.5 మిమీ ఉంటుంది.

Read Also : iQOO Neo 6 : భారత్‌లో iQOO Neo 6 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ధర ఎంతంటే?