FIFA World Cup-2022: మైదానంలో జాతీయ గీతం ఆలపించకుండా మౌనంగా ఉండిపోయిన ఇరాన్ ఆటగాళ్లు

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు.

FIFA World Cup-2022: మైదానంలో జాతీయ గీతం ఆలపించకుండా మౌనంగా ఉండిపోయిన ఇరాన్ ఆటగాళ్లు

FIFA World Cup-2022: ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.

కొన్ని వారాల క్రితం హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందినప్పటి నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు.

ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీరెజా జహంబఖష్ చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..