FIFA World Cup-2022: సొంత దేశం ఓడిపోయినందుకు ఇరాన్‌లో ప్రజల సంబరాలు

ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం పలకలేదు. ఓ 10 మంది అభిమానులు మాత్రం ఆ జట్టును చూసేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అంతేకాదు, నిన్న అమెరికాలో చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో జనాలు సంబరాలు చేసుకున్నారు. సొంత జట్టు ఓడిపోతే ప్రజలు బాణసంచా కాల్చి, డ్యాన్స్ చేస్తూ వేడుక చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

FIFA World Cup-2022: సొంత దేశం ఓడిపోయినందుకు ఇరాన్‌లో ప్రజల సంబరాలు

FIFA World Cup-2022: ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం పలకలేదు. ఓ 10 మంది అభిమానులు మాత్రం ఆ జట్టును చూసేందుకు విమానాశ్రయానికి వచ్చారు.

అంతేకాదు, నిన్న అమెరికాలో చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో జనాలు సంబరాలు చేసుకున్నారు. సొంత జట్టు ఓడిపోతే ప్రజలు బాణసంచా కాల్చి, డ్యాన్స్ చేస్తూ వేడుక చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరాన్ జట్టు దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని ప్రభుత్వానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రజలు అంటున్నారు.

కొన్ని వారాలుగా ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ఫుట్ బాల్ జట్టు సభ్యులు ప్రజలకే మద్దతు తెలిపినప్పటికీ వారిని సొంత దేశ జనాల నుంచి మద్దతు దక్కలేదు. ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తొలి మ్యాచులో తలపడిన సమయంలో ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడగా, ఇరాన్ జట్టు సభ్యులు మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు.

Fifa world cup 2022: ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు: ముస్లిం మతబోధకుడు

ఇరాన్ ప్రభుత్వానికి, హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు ఆ విధంగా మద్దతు తెలిపింది. అయినప్పటికీ, తమ దేశ జట్టు ప్రభుత్వానికి మాత్రమే పాతినిధ్యం వహిస్తూ ఫిఫా ప్రపంచ కప్ లో ఆడిందని, తమ తరఫున కాదని ఇరాన్ ప్రజలు అంటున్నారు. కాగా, స్ట్రైకర్ సర్దార్ అజ్మౌన్ ఇరాన్ చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

నిన్న మ్యాచులో తాను ఆడిన తీరు పట్ల సంతృప్తిగా లేనని అన్నారు. ప్రపంచ కప్ లో ఇరాన్ పాల్గొనడం ఇది ఆరో సారి. కొన్ని నెలల క్రితం హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ పోలీసులు మహ్సా అమిని అనే యువతిని అరెస్టు చేయగా, పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..