క్వారంటైన్‌లో చికెన్ కర్రీ ఇవ్వలేదని..చేయి విరగ్గొట్టాడు

  • Published By: madhu ,Published On : May 24, 2020 / 07:27 AM IST
క్వారంటైన్‌లో చికెన్ కర్రీ ఇవ్వలేదని..చేయి విరగ్గొట్టాడు

కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. క్వారంటైన్ కు తరలించారు. మంచిగా బుద్ధిగా ఉండక..తాను ఇష్టపడిన ఆహారం ఇవ్వలేదనే కారణంతో..మహిళా ఆశా కార్యకర్త చేయి విరగ్గొట్టాడు. ఈ ఘటన కర్నాటకలోని కలబురిగిలో చోటు చేసుకుంది. సోమనాథ కంబలే..తో పాటు..ఐదుగురు కుటుంబసభ్యులు ముంబై నుంచి ఇటీవలే వచ్చారు. వీరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో కలబురిగి జిల్లాలో ఆళంద కిణ్ని అబ్బాస్ గ్రామంలో క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఆశా కార్యకర్త రేణుక రోగులకు సహాయం చేస్తోంది. 

2020, మే 22వ తేదీ శుక్రవారం రాత్రి…తనకు చికెన్ కర్రీ, చేప వంటకాలతో భోజనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు సూచించిన భోజనాన్ని మాత్రమే అందచేయడం జరుగుతుందని రేణుక నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురై రేణుకపై దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ఆమె చేయి విరిగింది. అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు సోమనాథ, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.