Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటంతోపాటు, హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అయితే వెనిగర్ ను అతిగా తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు కలిగే ప్రమాదం ఉంటుంది.

Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

Apple Cider Vinegar

Apple Cider Vinegar : సాధారణంగా వెనిగర్‌ను వంట, బేకింగ్, సలాడ్ డ్రెస్సింగ్ లలో ఉపయోగిస్తుంటారు. చాలామందికి వెనిగర్‌ గురించి పూర్తి స్ధాయిలో అవగాహన లేదు. కొన్నిరకాల వంటల్లో వెనిగర్‌ ఉపయోగించటం వల్ల ఆ వంటకాల రుచి మారిపోతుంది. యాపిల్‌ సైడ్ వెనిగర్ ను నిర్ణీత మోతాదులో రోజు వారిగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం గ్రీకులు వెనిగర్ ను గాయాలు నయం చేసుకునేందుకు ఉపయోగించేవారు. హిప్పోక్రెట్స్ కాలంలో వెనిగర్ ను ఒక ఔషదంగా భావించేవారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది వెనిగర్ తో బరువు తగ్గించుకోవటానికి, హృదయ ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి, చుండ్రు పోగొట్టుకోవటానికి ఉపయోగిస్తున్నారు.

బరువు తగ్గడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వెనిగర్ ఊబకాయాన్ని తగ్గించటంలో సహాయపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టైప్ 2 డయాబెటీస్ తో పోరాడుతున్న రోగుల్లో వెనిగర్ రక్తంలో గ్లూకోజ్ , ఇన్సులిన్ స్ధాయిలను మెరుగుపరిచినట్లు ఓ అధ్యయనంలో తేలింది. వెనిగర్ పాలీ ఫెనాల్స్ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ వంటి వ్యాధులను ప్రేరేపించే కణాలను నియంత్రిచటంలో సహాయపడతాయి. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటంతోపాటు, హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అయితే వెనిగర్ ను అతిగా తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు కలిగే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఉపయోగించటం వల్ల జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కడుపులో అసౌకర్యం కలిగిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి వాటికి కారణమౌతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మోతాదులో వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దంతాలపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆరోగ్యానికి మంచిదే అయినా మోతాదులో తీసుకోవాలి.