Radish : చలికాలంలో ముల్లంగి తింటే ఆరోగ్యానికి ప్రయోజనమా?…

దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే, ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిపై నిమ్మరసం వేసి దంతాల మీద రుద్దండి. ఇది పసుపు రంగును తొలగిస్తుంది.

Radish : చలికాలంలో ముల్లంగి తింటే ఆరోగ్యానికి ప్రయోజనమా?…

Radish (1)

Radish : ముల్లంగిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీని సుగుణాలు తెలియక చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు. ఉత్తరాది వాసులు ముల్లంగిని అత్యంత ఇష్టంగా తింటారు. దక్షిణాది విషయానికి వస్తే కేవలం సాంబార్, కూర, పచ్చడి తప్పితే ఇతర రూపాల్లో పెద్దగా మనవారు ముల్లంగి తినరు. ముల్లంగిని చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది సీజనల్ వెజిటబుల్, ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శీతాకాలంలో ఎక్కువగా పండే ముల్లంగి తింటే రోగనిరోధక శక్తి బాగా వృద్ధిచెందుతుంది.

సీ విటమిన్ పుష్కలంగా ఉన్న ముల్లంగి చలికాలంలో జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా కాపాడుతుంది. తరచూ ముల్లంగి తింటే రోగాలు దరిచేరకుండా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన రిస్క్ తగ్గుతుంది. ఇందులో ఉండే ఆంత్రాసిన్ గుండె జబ్బుల స్థాయిని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న ముల్లంగి మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉండేలా కాపాడుతుంది. హృద్రోగాల బారిన పడకుండా ముల్లంగి పనిచేస్తుంది.

ముల్లంగిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. జీర్ణకోశ సమస్యలున్నవారు ముల్లంగి అధికంగా తినాలి. దీంతో జీర్ణక్రియలు చురుకై అజీర్తి వంటి సమస్యలు పోతాయి. జీర్ణక్రియ సులభం అవుతుంది.మధుమేహ రోగులు కూడా ముల్లంగిని తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది. అయితే, రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని తీసుకోకూడదు. లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

శారీరక అలసట ఉన్నప్పుడు ముల్లంగి రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే, ముల్లంగిని తింటే మేలు చేస్తుంది.ముల్లంగిని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న పీచు పదార్థం మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. మొలలు ఉన్న వారు ముల్లంగి తినటం అలవాటు చేసుకుంటే మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచే శక్తి ఉన్న ముల్లంగి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను అందిస్తుంది.

దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే, ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిపై నిమ్మరసం వేసి దంతాల మీద రుద్దండి. ఇది పసుపు రంగును తొలగిస్తుంది. ముల్లంగిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కిడ్నీ, లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అజీర్తి సమస్య కూడా దూరమవుతుంది. ఆకలిగా అనిపించకపోతే, ముల్లంగిని తినండి. ఇది ఆకలిని పెంచుతుంది. ముల్లంగి మాత్రమే కాదు వాటి ఆకులు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మంచివి. పురుషుల్లో సంతానోత్పత్తికి ముల్లంగి బాగా పనిచేస్తుంది.

ఈ ఆకు రసాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ముల్లంగితో ఒనగూరే ప్రయోజనాలన్నీ వాటి ఆకులతో కూడా వస్తాయి. కామెర్ల నివారణకు ఈ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముల్లంగి, వాటి ఆకులే కాదు రసం కూడా మంచిది. సన్నబడాలనుకున్న వారు ముల్లంగిని తరచూ తినేలా చూసుకోవాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ముల్లంగితో కడుపు బాగా నిండి, ఆకలిని అదుపు చేస్తుంది. తక్కువ కెలెరీలున్న ముల్లంగితో త్వరగా ఆకలి అనే భావన కలగకుండా ఉంటుంది.