Sweet Corn : స్వీట్ కార్న్ తినటం షుగర్ రోగులకు మంచిదేనా….

ముఖ్యంగా డయాబెటిస్ రోగులు స్వీట్ కార్న్ ను పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్ధాయిలు అదుపులో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.

Sweet Corn : స్వీట్ కార్న్ తినటం షుగర్ రోగులకు మంచిదేనా….

Sweet Corn

Sweet Corn : డయాబెటిస్ తో బాధపడే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై విభిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను పెంచుతుండగా, మరికొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను నియంత్రిస్తున్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు స్వీట్ కార్న్ తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తీపి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.

ముఖ్యంగా డయాబెటిస్ రోగులు స్వీట్ కార్న్ ను పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్ధాయిలు అదుపులో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. తీపి మొక్కజొన్న, మొక్కజొన్న కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగిలా చేస్తుంది. ఇన్సులిన్ స్ధాయిలు పెరగకుండా నియంత్రించే గుణ కలిగి ఉండటంతో డయాబెటిస్ రోగులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు.

స్వీట్ కార్న్ లో ఉండే ఫైటో కెమికల్స్ శరీరంలోని ఇన్సులిన్ పెరుగుదలను నియంత్రిస్తుంది. అదేక్రమంలో మొక్కజొన్నలో ఉండే ఆంథోసైనిన్స్ మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటిస్ రోగులలో మూత్రపిండాల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం స్వీట్ కార్న్ తీసుకోవటం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.

స్వీట్ కార్న్ లో సహజమైన చక్కెరలు , ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న కెర్నల్స్లో ఫినోలిక్ ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇవి కాన్సర్ నివారణకు దోమదపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచటంలో తోడ్పడే ఐరన్, విటమిన్ ఎ, థియామిన్, విటమిన్ బి6, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే వీటిని ఎంత పరిమాణంలో తీసుకోవాలో నిపుణులను సంప్రదించి తీసుకుంటే మంచిది.