Blood Pressure : అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందా?…

శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల ద్వారా రక్తపోటు ను గుర్తించ వచ్చు. తరచూ తలనొప్పి రావడం , తలపైభాగంలో బరువు , భారంగా ఉండడం, తలతిరగడం , చాతి బరువు , నొప్పిగా ఉండడం , చూపు మందగించడం, వికారము,వాంతి అనిపించడం ,

Blood Pressure : అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందా?…

Blood Pressure

Blood Pressure : ఇటీవలి కాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక కారణాలతో హై బీపీ వస్తుంది. రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు హై ప్రజర్ గాను , 90/60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు లో ప్రజర్ గాను పిలుస్తారు. ఈ రెండు ప్రమాదకరమైనవే.

కారణం ఏదైతేనేం అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి ఆటుపోట్లకు దారితీస్తుంది. బ్రెయిన్ హామరేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక హై బీపీని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. అంతేకాకుండా శారీరకంగా , మానసికంగా ఎక్కువ ఇబ్బందిపడ్డ సమయంలో రక్తపోటు పెరుగుతుంది. అలాగే చిన్నదానికి చాలా మంది ఆవేశపడుతుంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోరాదు. భయం, ఆత్రుత, అదే క్రమంలో కొన్ని రకాల వ్యాధుల వల్ల సైతం రక్తపోటు వస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాల జబ్బులు, ఊబకాయము, ఉప్పు, కారాలు అధికంగా తీసుకోవటం, వంశపారంపర్యంగా రక్తపోటు సమస్య ఉత్పన్నమౌతుంది.

శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల ద్వారా రక్తపోటును గుర్తించవచ్చు. తరచూ తలనొప్పి రావడం , తలపైభాగంలో బరువు , భారంగా ఉండడం, తలతిరగడం , చాతి బరువు , నొప్పిగా ఉండడం , చూపు మందగించడం, వికారము,వాంతి అనిపించడం , మాట తడబడడం ,తరచూ చెమట పట్టడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళి రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మంచిది. బీపీ అదుపు తప్పకుండా ఉండేందుకు ఎన్నో సులువైన మార్గాలున్నాయి. వాటిల్లో ఏ కొన్ని పాటించినా హై బీపీ నుండి బయట పడవచ్చు. రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల రక్తప్రసరణ సవ్యంగా సాగి, హై బీపీ తగ్గుతుంది.

హైబీపి తగ్గాలంటే ఆహార అలవాట్లలో మార్పు చేసుకోవాలి. ఉప్పు, కారము, క్రొవ్వు పదార్దములు తక్కువగా తినాలి , తాగుడు ,ధూమపానము వ్యసనాలను మానుకోవాలి. క్రమము తప్పకుండ వ్యాయామము చేయాలి. పచ్చటి చెట్ల మధ్య అరగంటపాటు వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ప్రాణాయామం, వజ్రాసనం, మత్స్యాసనం మొదలైన ఆసనాలు హై బీపీని తగ్గిస్తాయి. తినే పదార్ధాల్లో ఉప్పు బాగా తగ్గించాలి. వత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చేయాలి.సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి. ఉసిరి పొడిని తేనెతో రంగరించి తింటే హై బీపీ తగ్గుతుంది. పుచ్చకాయ జ్యూసు అధిక రక్తపోటును నివారిస్తుంది.