Coffee Tea : కాఫీ తాగటం మంచిదా?..టీ తాగటం మంచిదా?

రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్నబడుతుందట. రోజుకు రెండు మూడు కప్పులు మాత్రమే కాఫీ తాగాలి.

Coffee Tea :  కాఫీ తాగటం మంచిదా?..టీ తాగటం మంచిదా?

Tea Cofee

Coffee Tea : టీ, కాఫీలు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. పేదపారి నుండి కోటీశ్వరుల వరకు అందరూ కూడా టీ, కాఫీలను నిత్యం సేవిస్తుంటారు. కాఫీ అయినా, టీ అయినా వాటిలో ఉండే వివిధ పదార్ధాలు మన మెదడులోని రసాయనికి మార్పులకు కారణమౌతాయి. దీంతో ఉత్సాహం, చురుకుదనం వస్తుంది. వీటిలో ఉండే కేలరీల వల్ల శరీరానికి శక్తి కూడా అందుతుంది. పని వత్తిడి, అలసటతో ఉన్నవారు తరచూ టీ, కాఫీలను తీసుకుంటుంటారు.

మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్ మీటర్ అడినోసిస్ ను బ్లాక్ చేయటంలో కాఫీ, టీలు దోహదపడతాయి. నిద్ర మత్తును పోగొట్టటంలో ఉపయోగపడుతుంది. కెఫిన్ ఆరోగ్య రిత్యా మంచిదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిందే కాఫీ,టీలతో చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. అయితే పరగడుపున కాఫీ తాగటం ఏమాత్రం మంచిది కాదు.

టీ,కాఫీలు తాగకపోతే చాలా మందిలో ఎదో మిస్సైన ఫీలింగ్ వస్తుంటుంది. ఇంకొందరైతే ఏకంగా రోజుకు నాలుగైదుసార్లు అయిన టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే ఆరోగ్యానికి టీ లేదా కాఫీ.. ఈ రెండిట్లో ఏది బెస్ట్. ఆరోగ్యానికి ఈరెండింటిలో ఏది మేలు చేస్తోంది అనే సందేహాలు ఉన్నాయి.

ఈ రెండింటిలో కాఫీ కన్నా టీ తాగటం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఎందుకంటే టీలో మానసిక ప్రశాంతను చేకూర్చటంలో సహాయపడుతుంది. చక్కెర, పాలశాతాన్ని తగ్గించుకుని టీ తాగాలి. ప్రతిరోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. ఎక్కువగా పనిభారంగా ఫీల్ అయ్యేవారు టీ తాగితే బెటర్.. టీ తాగడం వలన శ‌రీరానికి ఉత్సాహం, ఉత్తేజం రెండు క‌లుగుతాయి. ఇక బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాశముంటుంది. టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగిస్తుంది.

రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగుతుంది. అంతేకాకుండా నడుం కూడా సన్నబడుతుంది. రోజుకు రెండు మూడు కప్పులు మాత్రమే కాఫీ తాగాలి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు వీలైనంత వరకు కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీల‌లో కెఫీన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. మోతాదు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మోతాదులో తీసుకుంటేనే మంచింది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి.

రాత్రి సమయంలో విధులు నిర్వర్తించే వారు టీ, కాఫీలు అదేపనిగా సేవించరాదు. దీని ఆరోగ్యానికి మంచిదికాదు. టీ తాగేవాళ్ళలో పళ్లు పసుపు రంగులోకి మారతాయి. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని సంగ్రహించకోవటం కష్టంగా మారుతుంది. కాఫీ లో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ.