Rice OR Capthi : రాత్రి సమయంలో అన్నం తినటం మంచిదా! చపాతీలు బెటరా?

బరువు పెరగకుండా ఉండాలంటే రోటీలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు రాత్రి సమయంలో రైస్ కంటే గోధుమలతో చేసిన చపాతీలు తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం కూడా మంచిదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.

Rice OR Capthi : రాత్రి సమయంలో అన్నం తినటం మంచిదా! చపాతీలు బెటరా?

Rice OR Capthi : అధిక బరువు చాలా మందిలో పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు సమస్యకు ప్రదాన కారణం రాత్రి సమయంలో ఆహారంగా అన్నం తీసుకోవటమేనన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీంతో నిపుణుల సూచనల మేరకు అన్నం తినటం మానేసి చపాతీలు తింటున్నారు.

వాస్తవానికి వైట్ రైస్ కంటే గోధుమ పిండిలో ప్రొటీన్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్లు, పొటాషియం ఉంటాయి. రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. రైస్ కంటే రోటీలో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని అనిపించదు. బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. అయితే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు రక్తంలో నిదానంగా కలుస్తాయి.

బరువు పెరగకుండా ఉండాలంటే రోటీలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు రాత్రి సమయంలో రైస్ కంటే గోధుమలతో చేసిన చపాతీలు తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం కూడా మంచిదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. కొద్దిపాటి భోజనంలో ఒక రోటీని భాగం చేసుకోని అందులోకి ప్రొటీన్స్ తో పాటు కాయగూరలు, ఆకు కూరలను ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది. చపాతీలను ఎక్కువ నూనె కాకుండా, తక్కువ నూనెతో కాల్చుకోవాలి.