Bihar crisis: గవర్నర్‭తో మీటింగ్ తర్వాత నితీష్ రాజీనామా?

ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పార్టీ నుంచి రెబల్ నేతలను ఇప్పటికే బీజేపీ సిద్ధం చేసి ఉండొచ్చని, సమయం చూసి వారిని బీజేపీ వైపుకు లాగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Bihar crisis: గవర్నర్‭తో మీటింగ్ తర్వాత నితీష్ రాజీనామా?

is nitish kumar resigns after meeting with governor

Bihar crisis: బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధమయ్యారని, జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ఈరోజు సాయంత్రం బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్‭ను నితీష్ కలుసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీతో తెగతెంపులను ఆ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. జేడీయూ నేత ఉపేంద్ర కుశ్వాహ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘నూతన స్వరూపంతో నూతన కూటమికి నేతృత్వం వహించిన నితీష్ కుమార్‭జీకి అభినందనలు. నితీష్‭జీ ఇలాగే ముందుకు వెళ్లండి. దేశం మీకోసం ఎదురు చూస్తోంది’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

బీజేపీతో విడిపోయిన అనంతరం ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి నితీష్ కూటమి కట్టబోతున్నారని, ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరిగాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. అటువైపు అన్నీ సర్దుకున్నాకే బీజేపీకి టాటా చెప్పబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పార్టీ నుంచి రెబల్ నేతలను ఇప్పటికే బీజేపీ సిద్ధం చేసి ఉండొచ్చని, సమయం చూసి వారిని బీజేపీ వైపుకు లాగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

2020 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే తమ కూటమిని బలహీన పర్చే కుట్రలు జరుగుతున్నాయని నితీష్ అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఎల్‭జేపీ కేవలం జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే పోటీ చేసింది. అప్పుడు బీజేపీ-జేడీయూ కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని, ఎల్‭జేపీని బీజేపీ మ్యానేజ్ చేసిందనే విమర్శలు అప్పటి నుంచే వినిపిస్తున్నాయి. పేరు ప్రస్తావించుకుండా ఈ విషయాన్ని నితీష్ లేవనెత్తారు. ‘‘వాళ్లే చెప్పారు కదా ఒక ఉదహారణ ఉందని, ఇప్పటికైనా సరిగా ఉండకపోతే పార్టీకి మంచిది కాదని వాళ్లే అన్నారుగా’’ అని మంగళవారం మీడియాతో నితీష్ అన్నారు. బిహార్ రాజకీయాలు ఇంకో మలుపు తీసుకోనున్నాయనే విషయం స్పష్టమే కానీ, ఏ వైపుకు వెళ్లనున్నాయనే విషయంపై క్లారిటీ రావాలంటే గవర్నర్‭తో నితీష్ సమావేశం ముగియాలని, అనంతరం నితీష్ చేసే ప్రకటన నుంచి ఏ వైపుకు వెళ్తాయో తెలుస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

Bihar Assembly Speaker: స్పీకర్‭కు కొవిడ్ పాజిటివ్.. విచిత్రంగా ఒక్క రోజులోనే రికవరీ