ముగ్గులో ఉంచిన నిమ్మకాయను తొక్కడమే హత్యలకు కారణమా? మదనపల్లె డబుల్ మర్డర్ కేసు

ముగ్గులో ఉంచిన నిమ్మకాయను తొక్కడమే హత్యలకు కారణమా? మదనపల్లె డబుల్ మర్డర్ కేసు

madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ మూఢనమ్మకాలతో తమ ఇద్దరు కూతుళ్లను(అలేఖ్య, దివ్య) అతి దారుణంగా హతమార్చారని మొదట అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత ఈ అభిప్రాయం మారింది. పెద్దకూతురు అలేఖ్య వల్లే ఈ దారుణం జరిగిందన్న భావన కలుగుతోంది.

భోపాల్ లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైన అలేఖ్య ఆ తర్వాత కుటుంబసభ్యులందరిని మూఢనమ్మకాల వైపు నడిపించినట్లు తెలుస్తోంది. భోపాల్ కి దగ్గరలోని అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించే తాంత్రిక మాయగాళ్ల వలలో అలేఖ్య పడినట్లు భావిస్తున్నారు. వారిని తరుచుగా కలిసిన అలేఖ్య తాంత్రిక విద్య పట్ల ఆకర్షితురాలైంది. తాంత్రిక విద్యలు నేర్చుకోవడమే కాకుండా పునర్జన్మలపై విశ్వాసం పెంచుకుంది. లాక్ డౌన్ లో ఇంటికి వచ్చిన అలేఖ్య పునర్జన్మల గురించి కుటుంబసభ్యులకు అదే పనిగా వివరించి వారిని కూడా తాంత్రిక విద్యలు నమ్మేలా చేసింది. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండే పురుషోత్తం కుటుంబం అలేఖ్య చెప్పే మాటలను తేలిగ్గా నమ్మేసింది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సమయంలో ఆధ్యాత్మికు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు కుటుంబసభ్యులు. పునర్జన్మ, కలియుగం అంతం, సత్య లోకం వంటి వాటిపై అపరితమైన విశ్వాసం పెంచుకున్నారు. దేవుడు అన్న భావన మీద మితిమీరిన నమ్మకం, దెయ్యాలంటే అలవిమాలిన భయం.. పురుషోత్తం నాయుడి కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి.

హత్యలకు కొన్ని రోజుల ముందు చిన్నకూతురు సాయి దివ్య కుక్కను తీసుకుని వాకింగ్ కి వెళ్లింది. ఆ సమయంలో రోడ్డు మీద ముగ్గులో ఉంచిన నిమ్మకాయను తొక్కడం అనూహ్య పరిణామాలకు దారి తీసింది. దేవుళ్లను, దయ్యాలను విపరీతంగా నమ్మే కుటుంబం కావడంతో నిమ్మకాయ తొక్కి ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి సాయిదివ్య బాగా భయపడింది. అయితే ఆమె భయాలను పొగొట్టాల్సిన అక్క అలేఖ్య సమస్యను మరింత పెద్దది చేసింది. అలేఖ్య పునర్జన్మల విచిత్ర మానసిక పరిస్థితి హత్యలకు దారితీసింది.

తాయత్తులు, ప్రత్యేక పూజలతో సాయిదివ్య భయాలు తొలగలేదు. కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేశానని, దాన్ని చంపి మళ్లీ బతికించానని అలేఖ్య పదే పదే చెప్పడంతో కుటుంబసభ్యులు అది నిజమని నమ్మారు. శివుడు తన రూపంలో వస్తున్నాడని, కలియుగంలో చనిపోయి సత్యలోకంలో పుడతానని అలేఖ్య చెప్పిన మాటలపై వారికి గురి కుదిరింది. అంతిమంగా తాంత్రిక విద్యపై అలేఖ్య పిచ్చి నమ్మకం తీర్చలేని, పూడ్చలేని నష్టాలకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.[embedyt] https://www.youtube.com/watch?v=HvOXJCiz-XA[/embedyt]