Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిదికాదా?

నెయ్యికి ఉన్న వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని నెయ్యిని కనీసం రోజులో ఒక భోజనం లో అయినా తీసుకుంటే మంచిది.

Ghee : గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి నెయ్యి వాడకం మంచిదికాదా?

Ghee

Ghee : భారత దేశంలో ప్రాచీన కాలం నుండి ఆహారంలో నెయ్యి తీసుకోవటం అలవాటుగా వస్తోంది. పాల నుండి వెన్న నుండి నెయ్యిని తీస్తారు. ప్రతి ఇంట్లో సాంప్రదాయ వంటకాల్లో నెయ్యిని వినియోగిస్తుంటారు. బోజనంతోపాటు, వివిధ రకాల స్వీట్ల తయారీలో నెయ్యిని జోడిస్తారు. చపాతీ, కిచిడీ, పూర్ణం బూరెలు, పప్పన్నం, పొంగలి.. వీటన్నింటికీ నెయ్యి కావలసిందే, నెయ్యి లేకపోతే వీటికి రుచి రాదు. అయితే, రుచి మాత్రమే కాదు, నెయ్యికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఆయుర్వేదంలో నెయ్యిని ఔషధంగా బావిస్తారు. వైద్య పరంగా ప్రయోజకారిగా నెయ్యిని ఉపయోగిస్తారు. మరొక వాస్తవం ఏంటంటే నెయ్యిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. అయితే ఇవి గుండె ఆరోగ్యానికి బరువు తగ్గటానికి మేలు కలిగిస్తాయా లేదా అన్న అనుమానం చాలా మందిలో వ్యక్తమౌతుంటుంది.

మన పూర్వికులు నిత్యం నెయ్యిని తమ ఆహారంలో బాగం చేసుకోవటం వల్లే సుదీర్షమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాధించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని వల్లనే నెయ్యిని మన రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకోమని నిపుణులు సలహా ఇస్తుంటారు. నెయ్యిని ఆహారంలో తీసుకోవటం వల్ల చర్మం సౌందర్యవంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచటంతోపాటు వేసవిలో నెయ్యిని తీసుకుంటే వెచ్చదనాన్ని ఇస్తుంది.

నెయ్యిలో విటమిన్ ఇ, ఎ, సి, డి, కె మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని ఆరోగ్యప్రదాయనిగా చెప్తారు. అయితే ఇందులో ఉండే శ్యాచ్యురేటెడ్ ఫ్యాట్ కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది. అధిక సంతృప్త కొవ్వును తీసుకోవటం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పాడుతుంది. తద్వారా గుండె సమస్యలకు దారి తీస్తుందిని పోషకాహార నిపుణురాలు రేణుకా ర్ఖేజా అంటున్నారు.

సంతృప్త కొవ్వులు ఎల్ డి ఎల్ కొవ్వులను పెంచుతాయి. ఈ పరిణామాలు గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలను తెచ్చిపెడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్ధాయిని పెంచే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్ధాయిని పెంచేందుకు అవకాశం ఉంటుందని రేణుకా ర్ఖేజా తెలిపారు.

సంతృప్త కొవ్వుకు మనిషికి శక్తి నివ్వటమే కాకుండా చురుకుదనంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. మొత్తానికి నెయ్యి వల్ల కలిగే పరిణామాలు వారి వారి శరీతత్వం, ఆరోగ్య పరిస్ధితిని బట్టి అధారపడి ఉంటుంది. శారీరకంగా చురుకుగా ఉండి,మంచి జీవక్రియలను కలిగి ఉంటే నెయ్యిని ఉపయోగించుకోవటం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు.

నెయ్యికి ఉన్న వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని నెయ్యిని కనీసం రోజులో ఒక భోజనం లో అయినా తీసుకుంటే మంచిది. రోజుకి ఒక వ్యక్తి మూడు నుండి ఆరు టీస్పూన్ల నెయ్యి తీసుకోవచ్చు. అంటే, బ్రేక్ ఫాస్ట్ లో ఒక టీ స్పూన్, లంచ్ లో ఒక టీ స్పూన్, డిన్నర్ లో ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. ఈ నేపధ్యంలో సంతృప్త కొవ్వును ఎక్కువగా తీసుకోవటం ఏమాత్రం ఆరోగ్యకరమైనది కాదు. కొంతమందిలో ఇది అధిక బరువు పెరిగేందుకు దారి తీస్తుందట.

నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తిన‌డం అల‌వాటు చేసుకుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క్ర‌మంగా క‌రుగుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. ఆక‌లి బాగా పెరుగుతుంది. థైరాయిడ్ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఇలా నెయ్యిని తింటే ఫ‌లితం ఉంటుంది. నిరుత్సాహంగా, నిస్స‌త్తువ‌తో ఉండేవారు ఉద‌యాన్నే అల్పాహారంతో నెయ్యి తినాలి. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది. ఏ ప‌ని ఎంత సేపు చేసినా అల‌సిపోకుండా ఉంటారు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది.