టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు కొట్టి లేపాను: కోహ్లీ

టీమిండియాకు సెలెక్ట్ అయినప్పుడు కొట్టి లేపాను: కోహ్లీ

భారత జట్టులో సుధీర్ఘకాలం నుంచి బౌలర్‌గా రాణాస్తున్నాడు పేసర్ ఇషాంత్ శర్మ. ఇండియ‌న్ పేస్ బౌల‌ర్‌గా వందో టెస్ట్ ఆడ‌బోతున్న ఇషాంత్ ఈ ఘనత దక్కించుకున్న కొద్దిమందిలో ఒకరు. బుధ‌వారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం అయ్యే టెస్ట్ మ్యాచ్‌ ఇషాంత్‌కు కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్‌. ఈ సంద‌ర్భంగా ఇషాంత్‌తో  త‌న‌కున్న స్నేహాన్ని షేర్ చేసుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి.

తొలిసారి భారత జట్టుకు ఇషాంత్ ఎంపికైన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకున్నాడు కోహ్లీ. ఇషాంత్ స్టేట్ క్రికెట్‌ను తనతో క‌లిసి ఆడ‌టం ప్రారంభించాడని, స్టేట్ క్రికెట్‌.. రంజీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కలిసి ఆడినట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ టైమ్ భారత జట్టుకు సెలెక్ట్ అయినప్పుడు.. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఇషాంత్ బాగా నిద్రపోతున్నాడు. ఈ గుడ్ న్యూస్ చెప్ప‌డానికి ఇషాంత్‌ని తన్ని లేపాను అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఇద్ద‌రం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం అని, ఎన్నో ఏళ్లుగా.. అత‌ను బౌలింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడ‌ని కోహ్లీ చెప్పుకొచ్చారు.

మోటెరాలో భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న ఇషాంత్.. టెస్ట్ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడుతుండగా.. 100 మ్యాచ్‌లు లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రికార్డు క్రియేట్ చెయ్యబోతున్నాడు. భారతదేశంలో రెండవ ఫాస్ట్ బౌలర్‌గా ఇషాంత్ ఈ రికార్డుకు చేరువయ్యాడు.

కపిల్ దేవ్ టెస్టుల్లో భారత్ తరఫున 131 మ్యాచ్‌లు ఆడగా.. ఇషాంత్ తన కెరీర్‌లో 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. భారత్ తరపున అన్ని మ్యాచ్‌లు ఆడిన 11 వ భారత క్రికెటర్‌గా ఇషాంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు.  ఓ పేస్ బౌల‌ర్ వంద టెస్టులు ఆడ‌టం సాధార‌ణ విష‌యం కాదు.