Ishq (Not a Love Story) : కార్‌లో కిస్ అడిగాడు.. తర్వాత ఏమైందబ్బా?..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుని, ‘ఓ బేబి’ మూవీతో నటుడిగా, ‘జాంబిరెడ్డి’తో హీరోగా ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, కొంటెగా కన్నుగీటి కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిన ప్రియా వారియర్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’.. (నాట్ ఏ లవ్‌స్టోరీ)..

Ishq (Not a Love Story) : కార్‌లో కిస్ అడిగాడు.. తర్వాత ఏమైందబ్బా?..

Ishq

Ishq (Not a Love Story): చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుని, ‘ఓ బేబి’ మూవీతో నటుడిగా, ‘జాంబిరెడ్డి’తో హీరోగా ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, కొంటెగా కన్నుగీటి కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిన ప్రియా వారియర్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’.. (నాట్ ఏ లవ్‌స్టోరీ)..

ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్ మీద ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. గురువారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఇష్క్’ మూవీ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తేజ, ప్రియల కెమిస్ట్రీ, శ్యామ్ కె.నాయుడు విజువల్స్, మహతి స్వరసాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 23న ‘ఇష్క్’.. (నాట్ ఏ లవ్‌స్టోరీ) మూవీ విడుదల కానుంది.