Cashews : జీడిపప్పు తినటం ఆరోగ్యానికి మంచిదా.. కాదా?

జీడిపప్పు తినడం వల్ల రక్తాభివృద్ధి చెందుతుంది మరియు ఎనిమియా జబ్బును అరికడుతుంది. నరాల వీక్నీస్ కూడా తగ్గుతుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే కొవ్వులు ఉంటాయి.

Cashews : జీడిపప్పు తినటం ఆరోగ్యానికి మంచిదా.. కాదా?

Cashew

Cashews : జీడిపప్పు తినేందుకు చాలా రుచికరంగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే మెత్తగా పిండిలా మారి నాలుకకు టేస్టీగా అనిపిస్తాయి. చాలా మంది వీటిని స్నాక్స్ గా ఆహారంలో బాగం చేసుకుంటుంటారు. జీడిపప్పులో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే చాలా మందిలో జీడిపప్పును తినే విషయంలో అనేక అపోహలు నెలకొని ఉన్నాయి. జీడిపప్పు తినటం వల్ల శరీరంలో కొవ్వులు పెరుగుతాయని , వీటి వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయని బావిస్తుంటారు. అయితే వాస్తవానికి వీటిని ఆహారంలో చేర్చటం వల్ల శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

జీడిపప్పు విషయానికొస్తే కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,జింక్,ఐరన్ ప్రోటీన్స్ సోడియం విటమిన్ సి విటమిన్ బి విటమిన్ కె యాంటీఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది అని కొందరు అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే అంటున్నారు డాక్టర్స్. దీనిలో కొవ్వు శాతం తక్కువ అలాగే, అన్ని రకాల విటమిన్లు వుంటాయి. పొట్టను నిండుగా ఉంచి, శరీరంలో వేడి ఉత్పత్తికి దోహదం చేస్తాయి. దీంతోపాటు జీవక్రియల వేగం పెరుగుతుంది. జీడిపప్పులో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు మరియు పాలీశాచ్యురేటెడ్ కొవ్వులు రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి , మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

జీడిపప్పు తినడం వల్ల రక్తాభివృద్ధి చెందుతుంది మరియు ఎనిమియా జబ్బును అరికడుతుంది. నరాల  కూడా తగ్గుతుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయవు. జీడిపప్పు రోజు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్, ఆస్తమా, కిడ్నీ, మోకాళ్ల నొప్పుల సమస్యలతో భాధ పడేవరువ్ జీడిపప్పును స్వీకరిస్తే ఎంతో బాగుంటుంది. జీడిపప్పును పచ్చిగా, లేదా వేయించుకుని ఎలాగైనా తీసుకోవచ్చు. చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి, వృద్ధాప్య చాయలను నిరోధించడానికి అవసరమైన ఆరోగ్యవంతమైన కొవ్వులను శరీరానికి జీడిపప్పు అందిస్తుంది.

జీడిపప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. జీడిపప్పులో ఇన్సులిన్ రెసిస్టెన్స్, గ్లూకోజ్ క్రమబద్దీకరణతో ముడిపడివుందని ఒక అధ్యయనంలో తేలింది. జీడిపప్పు తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. మెదడు పనితీరును మెరుగుపరచటంలో ఇవి ఎంతో దోహదపడతాయట. జీడిపప్పు తినటం వల్ల కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.