హైదరాబాద్‌లో సిట్యుయేషన్ సీరియస్, కరోనా రోగులతో నిండిపోయిన ప్రైవేట్ ఆసుపత్రులు , బెడ్స్ ఫుల్

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఫుల్‌

హైదరాబాద్‌లో సిట్యుయేషన్ సీరియస్, కరోనా రోగులతో నిండిపోయిన ప్రైవేట్ ఆసుపత్రులు , బెడ్స్ ఫుల్

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఫుల్‌

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఫుల్‌ అయ్యాయి. కొన్ని ఆస్పత్రుల్లోనే బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. 23 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దాదాపు 11 వాటిల్లో బెడ్స్‌ పూర్తిగా నిండిపోయాయి. అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా రోగులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. దీంతో రానున్న రోజుల్లో భారీగా కేసులు నమోదైతే… పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. ఒకవైపు ఐసోలేషన్‌ వార్డులన్నీ ఫుల్‌ అవుతోంటే.. ప్రభుత్వం మాత్రం నాలుగువేల బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని చెబుతోంది.

ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పెరిగిన కరోనా రోగుల సంఖ్య:
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న బాధితులు.. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు… ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.  అంతేకాదు.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు కూడా తెలంగాణ సర్కార్‌ ఇప్పటికే పర్మిషన్‌ ఇచ్చింది. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు సైతం కరోనా రోగులతో నిండిపోతున్నాయి. హైదరాబాద్‌, దాని చుట్టూ ఉన్న జిల్లాల్లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో వారిలో కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతుండగా… మరికొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది.

హైదరాబాద్‌లో 23 ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు.. 11 ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుల్లో బెడ్స్‌ ఫుల్‌:
హైదరాబాద్‌ నగరంలో 23 ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 11 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లోని బెడ్స్‌ దాదాపు నిండిపోయాయి. మరో 6 ఆసుపత్రుల్లో మాత్రం రోగుల క్వారంటైన్ గడువు ముగియడంతో వారి స్థానాల్లో కొత్త రోగులు చేరుతున్నారు. ఇవి తప్ప నగరంలోని అన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో దాదాపుగా బెడ్స్‌ పుల్‌ అయినట్టుగా తెలుస్తోంది. నగరంలో కేవలం ఒకే ఒక్క కార్పొరేట్‌ ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఆ ఆస్పత్రి కూడా మరికొన్ని ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం వల్లే ఖాళీ బెడ్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజులు గడిస్తేనే కానీ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్స్‌ ఖాళీ అయ్యే అవకాశం లేదని ఆన్‌లైన్‌ సమాచారం ఇస్తున్నారు.

4వేల బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయంటోన్న వైద్య ఆరోగ్యశాఖ:
నగరంలో ఓ వైపు ప్రైవేట్‌, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో బెడ్స్‌ ఫుల్‌ అవుతోంటే మరో నాలుగువేల బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గాంధీలో కేవలం 550 మంది రోగులే ఉన్నారని…. అక్కడ మరింత మందికి కరోనా చికిత్స అందించే అవకాశముందని చెబుతున్నారు. గాంధీలో సిబ్బందితో పాటు బెడ్స్‌ను పెంచనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని…వివిద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇప్పుడే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్‌లు ఫుల్‌ అయ్యాయి. రాబోయే రోజుల్లో భారీ కేసులు వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన నెలకొంది. దీంతో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులతోపాటు సర్కారీ దవాఖానాల్లోనూ బెడ్ల సంఖ్య మరింత పెంచాలని పలువురు సూచిస్తున్నారు.

Read: ప్రమోషన్ రాలేదన్న మనస్తాపంతో, తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా