Supreme Court :వాళ్లు మనుషులే..సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశించింది.వృత్తి, ఉద్యోగాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించాలని ఆదేశించింది

Supreme Court :వాళ్లు మనుషులే..సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం

Issue Aadhaar Voter Cards To Sex Workers

Issue Aadhaar voter cards to sex workers : సెక్స్ వర్కర్లకు కాస్త ఊరట కలిగే న్యూస్ చెప్పింది సుప్రీం కోర్టు. సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులను అందించాలని కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు ఇవ్వటం కేంద్రం పని అయితే..రేషన్ కార్డులు ఇవ్వటం ఆయా రాష్ట్రాల పని. అందుకే సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్లు సమాజంలో భాగమని అందరికి ఉన్నట్లే అన్ని హక్కులు వారికి కూడా ఉంటాయని ఈసందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వృత్తి, ఉద్యోగాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించాలని.. గుర్తింపు కార్డులు లేనివారికి కూడా రేషన్‌ బియ్యం ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఆదేశించింది. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో సెక్స్ వర్కర్లు చాలా ఇబ్బందులు పడ్డారని..తినటానికి తిండికూడా లేని దుస్థితి అనుభవించారని..తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆహారం హక్కు మానవ హక్కుగా గుర్తించబడి ఉంది అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో సెక్స్ వర్కర్లు పడిన సమస్యలపై వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more : Mystery disease : సూడాన్ లో వింత వ్యాధితో 100మంది మృతి..

అలాగే సెక్స్ వర్కర్లుకు రేషన్‌ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు దశాబ్దం కిందనే ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదు? అని ఈ సందర్భంగా ప్రశ్నించింది. వృత్తి, ఉద్యోగానికి సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని..అలాగే ఈ సమాజంలో భాగంగా ఉన్న సెక్స్ వర్కర్లు కూడా మనుషులేనని గుర్తు చేసింది. వారికి అందరికి ఉన్నట్లే అన్ని హక్కులు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. దేశంలోని ప్రజలకు ప్రభుత్వాలు విధిగా అన్ని సౌకర్యాలని కల్పించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్‌ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం వ్యక్తంచేస్తు సీరియస్ అయ్యింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే సెక్స్ వర్కర్లకు రేషన్‌, ఓటర్‌ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO), రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘాల సహాయం తీసుకోవాలని తెలిపింది.

Read more : Birth Control Pills : గర్భనిరోధక మాత్రలతో మహిళల్లో ఆస్తమా దూరం.. పరిశోధనల్లో వెల్లడి..

కమ్యూనిటీ ఆధారిత సంస్థలు అందించిన సమాచారంతో సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. సెక్స్ వర్కర్లకు అందించే ఐడీ కార్డులను తయారు చేసే క్రమంలో వారి పేర్లు..వివరాలు గోప్యంగా ఉంచాలని సుప్రీం కోర్టు సూచించింది.