Agnipath: సికింద్రాబాద్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు: కిషన్ రెడ్డి
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అగ్నిపథ్ విషయంలో యువతను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు.

Agnipath: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అగ్నిపథ్ విషయంలో యువతను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారని ఆయన చెప్పారు. అగ్నిపథ్ విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యువతలో దేశ భక్తి, జాతీయ వాదాన్ని పెంచేందుకు అగ్నిపథ్ తీసుకువచ్చారని ఆయన అన్నారు. చిన్ననాటి నుంచే చాలా మంది ఆర్మీలోకి వెళ్లాలని కలలు కంటారని ఆయన చెప్పారు. అగ్నిపథ్ పథకంలో స్వచ్ఛందంగా ఇష్టపడ్డ వారే చేరవచ్చని అన్నారు. ఇజ్రాయిల్‌లో తప్పనిసరిగా యువతి, యువకులు ఆర్మీలో పనిచేయాలనే నిబంధన ఉందని ఆయన చెప్పారు.
Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..
అనేక దేశాల్లో అగ్నిపథ్ లాంటి పథకాలు ఉన్నాయని తెలిపారు. బ్రెజిల్లో 18 సంవత్సరాలు దాటిన వారు 12 నెలలు, ఇరాన్లో 20 నెలలు, ఉత్తర కొరియాలో 17 ఏళ్ళు నిండిన వారు ఆర్మీలో పనిచేయాలని ఆయన చెప్పారు. సౌత్ కొరియా, మెక్సికో, యూఏఈ, సింగపూర్, స్విడ్జర్లాండ్, టర్కీ, గ్రీస్‌లో తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కానీ, భారత్‌లో మాత్రం ఇష్టం ఉన్న వారే సైన్యంలో చేరేలా అగ్నిపథ్ పథకం ఉందని చెప్పారు. అగ్నిపథ్ కింద సైన్యంలో పనిచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో చేరవచ్చని అన్నారు. అగ్నిపథ్ వీరులకు నాలుగేళ్ళ పాటు వృత్తి నైపుణ్యం అందిస్తారని చెప్పారు. అగ్నిపథ్ పథకంపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ ప్రధాని కాక ముందు నుంచి సైనిక సంస్కరణలపై చర్చ జరుగుతుందని అన్నారు.
Agnipath: హైదరాబాద్ మెట్రో రైళ్ళు రద్దు.. ప్రయాణికుల ఇక్కట్లు
అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని తెలిపారు. దేశ సేవ కోసం.. దేశానికి యుద్ధ సమయంలో ఉపయోగపడేలా స్వచ్ఛంద పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందని ఆయన అన్నారు. అగ్నిపథ్‌పై కుట్ర చేయడం దురదృష్టకరమని చెప్పారు. రైల్వే స్టేషన్లో ఆందోళనతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టారని, పోలీసులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. 40 మోటార్ సైకిళ్ళు కాల్చేశారని, షాపులు ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వనిదే బాధ్యత అని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆయన అన్నారు రైల్వే స్టేషన్లలో గొడవ జరుగుతుందని తెలిసిన తరువాత సకాలంలో పోలీసులు రావాలని, ఎందుకు అల్లర్లు జరిగాయో దర్యాప్తు జరపాలని అన్నారు.
Agnipath: రైళ్ళ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుంది: సీపీఆర్వో రాకేశ్
ఇతర ప్రాంతాల్లో ధర్నాలు జరిగితే ముందే అరెస్ట్ చేస్తారని, ఇప్పుడు ఇంత గొడవ ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. రైళ్ళు తగలబెడితే సమస్య పరిష్కరం అవుతుందా అని నిలదీశారు. బిపిన్ రావత్ ఉన్నపుడే అగ్నిపథ్ పథకంపై చర్చ జరిగిందని, కేంద్ర సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అనేక కమిటీలు, విదేశీ పర్యటనలు చేసి అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. యువతకు అన్యాయం చేయాలని కేంద్రానికి లేదని చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచాలని, దేశ భక్తి పెంచాలన్న ఉద్దేశంతోనే అగ్నిపథ్ పథకం తెచ్చామని అన్నారు. పెన్షన్ మిగుల్చుకోవడానికి అగ్నిపథ్ పథకం తెచ్చామనడం అపోహ మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని అన్నారు.
Agnipath: నేడు దేశంలో ‘అగ్నిపథ్’ అగ్ని గుండంలా మారింది: వీహెచ్
మంత్రులు ట్విట్టర్ వేదికగా ఆందోళనలకు ఆజ్యం పోసేలా స్పందిస్తున్నారని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉందని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆయన అన్నారు. అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు. కేటీఆర్ రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతారా అని నిలదీశారు. కేంద్ర పథకం గురించి చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర పథకం కాబట్టి కేంద్ర ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అగ్నిపథ్ పథకం గురించి అనుమానాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. హింస ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదని ఆయన చెప్పారు. ఆందోళనకారులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కడా గొడవలు జరగకూడదనే కోరుతున్నానని తెలిపారు.
1Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్
2Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
3Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
4PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
5BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
6Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
7Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
8Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
9Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
10Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!