IT raids Ramky group : రాంకీ సంస్థలో ఐటీ దాడులు..రూ.300 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం

రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాంకీ సంస్థ ఉద్ధేశపూర్వకంగానే ట్యాక్స్ ఎగవేయటానికి నష్టాలు చూపించిందని ఐటీ అధికారులు నిర్ధారించారు. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్ల పన్ను ఎగ్గొట్టే యత్నించేసిందని తేల్చారు.

IT raids Ramky group : రాంకీ సంస్థలో ఐటీ దాడులు..రూ.300 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం

It Raids Ramky Group Properties Detects..

IT raids Ramky group : రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న తనీఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంకీ గ్రూప్‌లో రూ.300 కోట్ల నల్లధనం వెలికితీసినట్టు కేంద్ర ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది. గత నెల 16న తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల సోదాలు నిర్వహించగా బ్లాక్ మనీతో పాటు పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రాంకీ సంస్థ ఉద్ధేశపూర్వకంగానే ట్యాక్స్ ఎగవేయటానికి నష్టాలు చూపించిందని ఐటీ అధికారులు నిర్ధారించారు. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్ల పన్ను ఎగ్గొట్టే యత్నించేసిందని తేల్చారు. సంస్థలోని మేజర్ వాటాను సింగపూర్ కు చెందిన వ్యక్తులకు విక్రయించినట్లుగా ఐటీ శాఖ గుర్తించింది.
రూ.1200 కోట్లు నష్టం చూపించి పన్నులు ఎగ్గొట్టినట్లు నిర్ధారించామని ఐటీ శాఖ పేర్కొంది. రూ. 300 కోట్ల నల్లధనానికి పన్ను చెల్లించేందుకు..రాంకీ సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది.

కాగా..జులై 6న హైదరాబాద్‌లో రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అక్రమ ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు నిరూపించే.. పలు డాక్యుమెంట్లు ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.రాంకీ చైర్మన్‌ అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాంకీలోని మేజర్ వాటాని సింగపూర్ వ్యక్తులకు అమ్మేశారని, రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసిందని ఐటీ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంతో పాటు రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహించారు. రాంకీ సంస్థ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. సంస్థలతోపాటు ఎంపీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పలు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని అన్నింటినీ ఐటీ అధికారులు కూలంకషంగా పరిశీలించగా రాంకీ సంస్థ ట్యాక్స్ ఎగ్గొట్టటానికే తప్పుడు లెక్కలు చూపించి రూ.300ల కోట్ల పన్ను ఎగ్గొట్టేయత్నం చేసిందని నిర్ధారించారు.