Agnipath: రైళ్ళ‌ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుంది: సీపీఆర్వో రాకేశ్

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ పథ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో చెల‌రేగిన‌ ఆందోళ‌న‌లతో క‌ల‌క‌లం చెల‌రేగ‌డంపై రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పందించారు.

Agnipath: రైళ్ళ‌ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుంది: సీపీఆర్వో రాకేశ్

Nampally

Agnipath: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ పథ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో చెల‌రేగిన‌ ఆందోళ‌న‌లతో క‌ల‌క‌లం చెల‌రేగ‌డంపై రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పందించారు. రైళ్ళ‌ పునరుద్ధరణపై ఆయ‌న‌ 10 టీవీతో మాట్లాడుతూ.. ఈ విష‌యంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టిసారించిందని చెప్పారు. పూర్తిస్థాయిలో ఎంఎంటీఎస్ రైళ్ళ‌ను రద్దు చేశామని వివ‌రించారు.

Agnipath: నేడు దేశంలో ‘అగ్నిపథ్‌’ అగ్ని గుండంలా మారింది: వీహెచ్‌

పూర్తిస్థాయిలో రైళ్ళ‌ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుందని ఆయ‌న చెప్పారు. పలు రైళ్ళ‌ను దారి మళ్ళిస్తున్నామని అన్నారు.
ఆందోళనకారుల దాడిలో మూడు రైలులోని భోగీలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. సమాచారం అందుకోగానే స్టేషన్‌లోని ప్రయాణికులను బయటికి పంపించామని తెలిపారు. పలు బోగీల్లో మంటలు అంటుకున్నాయ‌ని చెప్పారు. నేడు రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి రిఫండ్ ఇస్తామని తెలిపారు.