గడువు ముగుస్తోంది.. మార్చి 31లోగా ఐటీఆర్‌తో ఆధార్‌ లింకు చేయండి.

అసలే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం.. ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ముగుస్తోంది. మార్చి 31 లాస్ట్ డేట్.. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్ను చెల్లింపుల సమయం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ముందుగా ఆధార్ నెంబరును జత చేయాల్సి ఉంటుంది.

గడువు ముగుస్తోంది.. మార్చి 31లోగా ఐటీఆర్‌తో ఆధార్‌ లింకు చేయండి.

ITR to PAN-Aadhaar linking : అసలే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం.. ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ముగుస్తోంది. మార్చి 31 లాస్ట్ డేట్.. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్ను చెల్లింపుల సమయం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ముందుగా ఆధార్ నెంబరును జత చేయాల్సి ఉంటుంది. ఇంతకీ మీరు ఐటీఆర్‌కు ఆధార్ జత చేశారా? డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. పన్ను ఆదా చేసే పెట్టుబడులు కాకుండా పన్ను చెల్లింపుదారులు జరిమానాలను పడకుండా ఉండాలంటే గడువు తేదీలోగా పన్ను మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, మార్చి 21 మధ్య ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానాల భారం మోయక తప్పదు. పన్ను సంబంధిత డాక్యుమెంట్లను అటాచ్ చేయడం ద్వారా పెనాల్టీలను తప్పించుకోవచ్చు.

ఐటీఆర్‌ను ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరాంతంలో మార్చి 31న లేదా ముందుగానే ఎప్పుడైనా దాఖలు చేసుకునే వీలుంది. గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన ఏదైనా ఆదాయపు పన్ను రిటర్నులను ఆలస్య రిటర్నులుగా పరిగణిస్తారు. పన్ను చెల్లింపుదారుడు సవరించిన రిటర్న్‌ను దాఖలు ఏవైనా మార్పులు చేయవలసి వస్తే చేసుకునే వీలుంది. సవరించిన ఐటీఆర్‌ను సమర్పించేందుకు గడువు కూడా మార్చి 31లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తికి ఏడాదికి రూ.10,000 కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటే.. ఆ వ్యక్తి నాలుగు వాయిదాల్లో ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక ఏడాదికి నాలుగో విడుత ముందస్తు పన్ను చెల్లించడానికి మార్చి 15 గడువు.

పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో తప్పకుండా లింక్ చేయాలి. దీనికి కూడా గడువు మార్చి 31 అనే విషయం గుర్తించుకోండి. గడువు తర్వాత ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ పనిచేయదు. బ్యాంకు అకౌంట్‌తో లింకై ఆధార్‌ నంబర్‌లోని పేరుతో పాన్‌ కార్డులోని పేరు ఇంటి పేరు ఒకేలా ఉండాలి. లేదంటే ఐటీఆర్‌ మొత్తం మీ బ్యాంక్‌ అకౌంట్లో జమ కాదని గుర్తించుకోవాలి. ఐటీ రిటర్నులు త్వరితగతిన రావాలంటే బ్యాంకు అకౌంట్‌, ఆధార్‌, పాన్‌ కార్డులోని వినియోగదారుల పేర్లు అన్ని ఒకేలా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఐటీ రిటర్న్ ప్రక్రియ పూర్తి అవుతుంది.