Royal Bengal Tiger: ఇక్క‌డ మొద‌ట రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌తో మీరు పోరాడాల్సి ఉంటుంది: మ‌మ‌తా బెన‌ర్జీ

రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌తో త‌న‌ను తాను పోల్చుకుంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఓ హెచ్చ‌రిక చేశారు. దేశంలో బీజేపీ చేస్తోన్న అభివృద్ధి ప‌నులు ఏవీ లేవ‌ని ఆమె అన్నారు. మూడు, నాలుగు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ద్వారా రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌ను కుప్ప‌కూల్చి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటోంద‌ని ఆమె విమ‌ర్శించారు. బెంగాల్ లో అది కుదరదని, ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉందని చెప్పారు.

Royal Bengal Tiger: ఇక్క‌డ మొద‌ట రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌తో మీరు పోరాడాల్సి ఉంటుంది: మ‌మ‌తా బెన‌ర్జీ

Royal Bengal Tiger: రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌తో త‌న‌ను తాను పోల్చుకుంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చైర్‌ప‌ర్స‌న్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఓ హెచ్చ‌రిక చేశారు. దేశంలో బీజేపీ చేస్తోన్న అభివృద్ధి ప‌నులు ఏవీ లేవ‌ని ఆమె అన్నారు. మూడు, నాలుగు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ద్వారా రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌ను కుప్ప‌కూల్చి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటోంద‌ని ఆమె విమ‌ర్శించారు. తాజాగా, ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్ మీడియా స‌ల‌హాదారు అభిషేక్ ప్రసాద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మైనింగ్ కుంభ‌కోణంలో స‌మ‌న్లు పంపి ఆగ‌స్టు 1న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించిన అంశాన్ని మ‌మ‌తా బెన‌ర్జీ గుర్తు చేశారు.

ఇటువంటి ప‌నులు చేసే మ‌హారాష్ట్రలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని కుప్ప‌కూల్చింద‌ని, ఇప్పుడు ఝార్కండ్‌లో అదే ప‌ని చేస్తోంద‌ని, అయితే, ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం ఇటువంటి ఆట‌లు సాగ‌ట్లేద‌ని అన్నారు. ఇటువంటి ప‌నులు ఇక్క‌డ కుద‌ర‌వ‌ని, ఎందుకంటే ఇక్క‌డ మొద‌ట రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్‌తో పోరాడాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.

2024లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాద‌ని తాను న‌మ్ముతున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం 40 శాతం పెరిగిపోయింద‌ని ఆమె చెప్పారు. ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం 45 శాతం మేర త‌గ్గింద‌ని చెప్పుకొచ్చారు. మీడియా ద్వారా ప‌శ్చిమ బెంగాల్‌కు చెడ్డ పేరు తీసుకువ‌చ్చేందుకు కొంద‌రు ప్రయ‌త్నిస్తున్నార‌ని ఆమె చెప్పారు.

China: మా దేశంపై దాడి చేసేందుకు చైనా ఆర్మీకి 2025లోపు పూర్తి సామ‌ర్థ్యం: తైవాన్