Pakistani drone: పాకిస్థాన్ డ్రోను జారవిడిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

భారత సరిహద్దు వద్ద పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఓ కేసుకు సంబంధించిన నిందితులను తాజాగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ)కు సమీపంలోని తోప్ గ్రామంలో పాకిస్థాన్ డ్రోను ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జారవిడిచి, క‌ల‌క‌లం రేపిందని పోలీసులు తెలిపారు. దీనిపై అర్నియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని వివరించారు. అనంతరం, ఈ కేసుతో సంబంధం ఉన్న జమ్మూకు చెందిన ఓ నిందితుడిని అరెస్టు చేశామని వివరించారు.

Pakistani drone: పాకిస్థాన్ డ్రోను జారవిడిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

Pakistani drone

Pakistani drone: భారత సరిహద్దు వద్ద పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఓ కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ)కు సమీపంలోని తోప్ గ్రామంలో పాకిస్థాన్ డ్రోను ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జారవిడిచి,
క‌ల‌క‌లం రేపిందని పోలీసులు తెలిపారు. దీనిపై అర్నియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని వివరించారు. అనంతరం, ఈ కేసుతో సంబంధం ఉన్న జమ్మూకు చెందిన ఓ నిందితుడిని అరెస్టు చేశామని వివరించారు.

అతడిని విచారించగా డ్రోను ఎక్కడెక్కడ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని జారవిడిచిందో తెలిపాడని చెప్పారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా, ఓ ప్రాంతంలో ఏమీ లభ్యం కాలేదని, మరో ప్రాంతంలో (తోప్ గ్రామంలో) ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ సమయంలో నిందితుడు తమతోనే ఉన్నాడని, పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడని వివరించారు.

దీంతో అతడిపై ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు చివరకు అతడిని అదుపులోకి తీసుకుని, ఆసుపత్రిలో చేర్పించారని అన్నారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు మృతి చెందాడని తెలిపారు. కాగా, జ‌మ్మూక‌శ్మీర్‌లోని వేర్పాటు వాదులు, ఉగ్ర‌వాదుల‌కు పాక్ డ్రోన్ల సాయంతో ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల వంటివి పంపుతూ వారికి పాకిస్థాన్ సాయం చేస్తోంది. పాక్ చ‌ర్య‌ల‌పై భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నిఘా ఉంచారు. పాక్ నుంచి వ‌చ్చే డ్రోన్ల‌ను కుప్ప‌కూల్చుతున్నారు.

Kabul mosque attack: అఫ్గాన్‌లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు