J.P.Nadda: జేపీ నద్దా ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

J.P.Nadda: జేపీ నద్దా ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే

J.p.nadda

J.P.Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11:40 వరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. 11:40 -12:10 వరకు ఎయిర్‌పోర్టు నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సభ జరిగే సిద్దార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్తారు. అనంతరం 12:15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 02:00 వరకు బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల సభలో పాల్గొంటారు.

Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

తర్వాత మధ్యాహ్నం 02:00 నుంచి సాయంత్రం 05:50 నిమిషాల వరకు నోవాటెల్ హోటల్‌లో లంచ్ బ్రేక్, విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 06:00 నుంచి 07:30 నిమిషాల వరకు మేధావులతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి 08:00 గంటల నుంచి 10:00 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం బీజేపీ నేతలతో కలిసి డిన్నర్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం 07:30 నిమిషాలకు విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం 08:30కి గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు.