Rajampet: బ్రిటీష్ ప్రభుత్వమే నయం.. జిల్లా కేంద్రంగా రాజంపేటే ప్రకటించాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వమే నయమని అన్నారు జేఏసీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి.

Rajampet: బ్రిటీష్ ప్రభుత్వమే నయం..  జిల్లా కేంద్రంగా రాజంపేటే ప్రకటించాలి

Rajempet

Rajampet: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వమే నయమని అన్నారు జేఏసీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి. ఆధ్యాత్మిక కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజకీయాలకు అతీతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సంధర్భంగా జేఏసీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పద కవితా పితా మహుడు అన్నమయ్య నడియాడిన నేల ఇదియని, ఎటువంటి సంబంధం లేని రాయచోటికి అన్నమయ్య పేరుని ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ సంధర్భంగా ఉద్యమాలను ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నమయ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ తాళ్లపాకలో 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, కొందరు రాజకీయ నాయకుల స్వార్థం వల్ల అన్నమయ్య నడయాడిన నేల రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జేఏసీ చెబుతోంది.

ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టిన రాజంపేటపై వైసీపీ పెద్దలు కుట్ర పన్నారని, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డిని ఇరుకున పెట్టడం కోసమే జిల్లా కేంద్రంను రాయచోటికి మార్చారని అభిప్రాయపడుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కి తప్పుడు సలహాలు ఇస్తున్నారని అన్నారు.