Avatar 2: అవతార్ 2 హిట్ అయితేనే.. లేకపోతే మర్చిపోండి అంటోన్న జేమ్స్ కామెరాన్!

ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏమిటని అడిగితే మెజారిటీ శాతం చెప్పే ఒకే ఒక సినిమా పేరు ‘అవతార్-2’. ఈ యేడాదిలో రిలీజ్ అవుతున్న అవతార్-2 సినిమాకు వచ్చే రిజల్ట్‌ను బట్టే ఆ తరువాత సీక్వెల్స్‌ను ప్లాన్ చేస్తానని ఈ లెజెండరీ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అవతార్-2 సినిమా ఫ్లాప్ అయితే, అవతార్ తదుపరి సీక్వెల్స్ గురించి మర్చిపోవాల్సిందే అంటూ ఆయన పేర్కొన్నారు.

Avatar 2: అవతార్ 2 హిట్ అయితేనే.. లేకపోతే మర్చిపోండి అంటోన్న జేమ్స్ కామెరాన్!

James Cameron On Sequel Movies After Avatar 2

Avatar 2: ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏమిటని అడిగితే మెజారిటీ శాతం చెప్పే ఒకే ఒక సినిమా పేరు ‘అవతార్-2’. విజువల్ వండర్స్‌ను క్రియేట్ చేసే స్పెషలిస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తున్న ఈ అద్భుతమైన విజువల్ వండర్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Avatar 2: ఆర్ఆర్ఆర్ బాటలో అవతార్.. అంత ఉన్నా తక్కువేనట!

ఇక రీసెంట్‌గా అవతార్ 2 సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి బ్లాస్టింగ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏ రేంజ్‌లో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక అవతార్ సినిమా రిలీజ్ సమయంలోనే జేమ్స్ కామెరాన్ ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. అవతార్‌కు కేవలం అవతార్-2 మాత్రమే కాకుండా మరో మూడు సీక్వెల్స్ కూడా ఉంటాయని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు అవతార్ 3,4,5 సీక్వెల్స్ విషయంలో జేమ్స్ కామెరాన్ ఓ సెన్సేషనల్ కామెంట్ చేశాడు.

Avatar 2: సినిమా పంథాను మార్చేసే అవతార్ 2.. విజువల్ వండర్ రెడీ!

ఈ యేడాదిలో రిలీజ్ అవుతున్న అవతార్-2 సినిమాకు వచ్చే రిజల్ట్‌ను బట్టే ఆ సీక్వెల్స్‌ను ప్లాన్ చేస్తానని ఈ లెజెండరీ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అవతార్-2 సినిమా ఫ్లాప్ అయితే, అవతార్ తదుపరి సీక్వెల్స్ గురించి మర్చిపోవాల్సిందే అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే అది జరగని పని అని తాను కూడా నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అవతార్-2 లోని విజువల్స్ ప్రేక్షకులకు లైఫ్‌టైమ్ మెమరీగా నిలిచిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాను డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.