Janhvi Kapoor : నాపై ట్రోలింగ్ కి ఆ నిర్మాతే కారణం..

తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చే ట్రోల్స్ కి స్పందించింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌ హౌస్‌ నన్ను లాంచ్ చేశారు...............

Janhvi Kapoor : నాపై ట్రోలింగ్ కి ఆ నిర్మాతే కారణం..

Janhvi Kapoor reacts on Trolls

Janhvi Kapoor :  బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వరుసగా కంటెంట్ సినిమాలతో బిజీగా ఉంది. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా కంటెంట్ సినిమాలతో ప్రయోగాలు చేస్తూ సేఫ్ జోన్ లో వెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన బోల్డ్ ఫోటోలని పోస్ట్ చేసి ట్రెండింగ్లో ఉంటుంది. అయితే జాన్వీ పై ట్రోల్స్ కూడా ఎక్కువే వస్తూ ఉంటాయి. స్టార్ కిడ్ కావడం, తన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల, కేవలం కంటెంట్ సినిమాలు మాత్రమే చేస్తున్నందుకు ఆమె ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

BiggBoss 6 Day 80 : కంటెస్టెంట్స్ ఫ్యామిలీలతో సందడిగా బిగ్‌బాస్..

తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చే ట్రోల్స్ కి స్పందించింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ”బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌ హౌస్‌ నన్ను లాంచ్ చేశారు. కరణ్ జోహార్ నాకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. బహుశా ఇదే నాపై ట్రోలింగ్ కి కారణమవ్వచ్చు. కరణ్ జోహార్ నన్ను లాంచ్ చేసినందుకే నన్ను ద్వేషిస్తున్నారు అనుకుంట. ఒక్కోసారి దీని వల్ల భయమేస్తుంది కానీ పట్టించుకోను. నన్ను, ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ లని ద్వేషించేవాళ్ళకి బహుశా వాళ్ళ గురించి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళ బ్యానర్ లో నా మొదటి సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. కరణ్ జోహార్ లాంటి మంచి నిర్మాత బాలీవుడ్ లో ఉండటం మన అదృష్టం, కరణ్ నాకు అన్ని విషయాల్లో గైడ్ చేస్తాడు” అని తెలిపింది.