Japan: జపాన్‌లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు

జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా. ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

Japan: జపాన్‌లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు

Japan

Japan: జపాన్‌లో ఎండలు మండిపోతున్నాయి. 147 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా.

Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. మళ్లీ ఆ స్థాయిలో ఎండలు పెరగడం ఈసారే. ఎండలు ఊహించని స్థాయిలో పెరగడంతో, ప్రజలు ఎండ వేడిమి తగ్గించుకునేందుకు ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వంటివి వాడుతున్నారు. విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. డిమాండ్‌కు సరిపడినట్లుగా ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. దీంతో అవసరమైతే అణు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాలని భావిస్తోంది. దాదాపు 2011 నుంచి అణువిద్యుత్ ప్లాంట్లు మూసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. అయితే, ఏసీలు వంటివి వాడుకోవచ్చని సూచించింది.

DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్‌డీఓ.. ప్రయోగం సక్సెస్

ఒకవైపు ఎండ వేడిమి పెరిగిపోవడం, మరోవైపు విద్యుత్ సరఫరా తగ్గిపోతుండటంతో అనేక కంపెనీలు తమ సిబ్బందికి పని వేళలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం విద్యుత్ వినియోగంపై పలు ఆంక్షలు విధించింది. పలు పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్ వాడకం తగ్గిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అలంకరణ కోసం వాడే లైట్లను నిలిపివేశారు. నిజానికి జూన్ నెల జపాన్‌లో వర్షాకాలం. కానీ, ఈ సారి భారీగా ఎండలు పెరగడంతో వర్షాకాలం ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది. 22 రోజుల ముందే వర్షాకాలం ముగియడం ఒక రికార్డు. మరికొద్ది రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.