ఆడవాళ్లు అతిగా వాగుతుంటారు..వాళ్లను బోర్డు డైరెక్టర్లుగా పెడితే టైమ్ వేస్ట్ చేస్తారు : ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఆడవాళ్లు అతిగా వాగుతుంటారు..వాళ్లను బోర్డు డైరెక్టర్లుగా పెడితే టైమ్ వేస్ట్ చేస్తారు : ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Tokyo Olympics Sensation coomments on women : మహిళలపై టోక్యో ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్.. జపాన్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపై విమర్శలు వెల్లువెత్తటంతో క్షమాపణ చెప్పారు. ఆడవాళ్లు అతిగా వాగుతుంటారు..వాళ్లను బోర్డు డైరోక్టర్లుగా పెడితే టైమ్ పాస్ చేస్తారు తప్ప ఎటువంటి ఉపయోగం లేదని అనవసరంగా మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేస్తారని యోషిరో మోరి వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. అనంతరం ఆయనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగటంతో నోరు జారాను సారి అంటూ క్షమాపణలు చెప్పారు యోషిరో మోరి.

కాగా..ప్రపంచ వ్యాప్తంగా విలతాండవం చేసిన కరోనా మహమ్మారికి కారణంగా టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణ గత సంవత్సరంనుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు టోక్యో ఒలింపిక్స్ కమిటీ యోషిరో మోరి నాయకత్వంలో పలుసార్లు సమావేశమైంది. టోక్యో ఒలింపిక్స్ కమిటీలో మొత్తం 24 మంది సభ్యులుండగా, వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.

ఈ కమిటీలో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచాలని గతంలో నిర్ణయించింది కమిటీ. అదే అంశంపై యోషియా మోరీ మాట్లాడుతూ…మహిళలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలు అతిగా వాగుతుంటారు..అలాంటివాళ్లను బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తే గంటల కొద్దీ అనవసరం విషయాల గురించి మాట్లాడుతూ సమయం మొత్తం తినేస్తుంటారు..వారి వల్ల టైమ్ వేస్ట్ అవుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే కమిటీలో మహిళల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకవేళ అందుకే..కమిటీలో మహిళల సంఖ్యను పెంచితే వారు సమావేశంలో మాట్లాడే సమయాన్ని తగ్గించాలని అన్నారు. తమ ప్రసంగాన్ని వెంటనే ముగించడం మహిళలకు చాలా కష్టమనీ..దీంతో సమావేశం టైమ్ వేస్టు అవుతుందని..వాళ్లు మాట్లాడటం వినటం ఎంతో చిరాకు పుట్టిస్తుందని వ్యాఖ్యానించారు.

దాంతో యోషిరోపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. మహిళలను కించపరిచేలా ఇంత దారుణంగా మాట్లాడతారా..మీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలపై ఏమాత్రం గౌరవం లేని ఇటువంటి వ్యక్తా..జపాన్ కు ప్రధానిగా చేశారా? టోక్యో కమిటీ చీఫ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. దీంతో నెటిజన్ల ఆగ్రహావేశాలు తట్టుకోలేని చేసేదేమీ లేక పాపం గురుడు యోషిరో మోరీ వెంటనే క్షమాపణలు చెప్పి పరిస్థితి మరింత ముదరకుండా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.