japan: ప్రపంచ వృద్ధురాలు కేన్ మృతి

ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధురాలు కేన్ టనాకా సోమవారం మరణించింది. జపాన్‌లోని ఫ్యూకోకా ప్రాంతానికి చెందిన టనాకా వయస్సు 119 సంవత్సరాలు.

japan: ప్రపంచ వృద్ధురాలు కేన్ మృతి

Kane Tanaka

japan: ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధురాలు కేన్ టనాకా సోమవారం మరణించింది. జపాన్‌లోని ఫ్యూకోకా ప్రాంతానికి చెందిన టనాకా వయస్సు 119 సంవత్సరాలు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జీవించి ఉన్న అతిపెద్ద వయస్సురాలు ఆమే. అధికారికంగా ఇప్పటివరకు ఎక్కువ కాలం బతికింది జీన్నే కాల్మెంట్. జీన్నే అనే వృద్ధురాలు 122 సంవత్సరాలు జీవించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి.

 

ఆ తర్వాత ఎక్కువ కాలం (119 సంవత్సరాలు) జీవించిన వ్యక్తిగా కేన్ టనాకా రికార్డుకెక్కింది. టనాకా జనవరి 2, 1903న జన్మించినట్లు అంచనా. టనాకా స్థానిక నర్సింగ్ హోమ్‌లో జీవించేది. ఆమె బోర్డ్ గేమ్స్ ఆడుతూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ప్రపంచంలోనే ఎక్కువశాతం వృద్ధులు జీవించి ఉన్నదేశంగా నిలిచింది జపాన్. అక్కడ 28 శాతం పైగా ప్రజలు 65 ఏళ్లు పైబడిన వాళ్లే.