Jathi Ratnalu : అప్పుడు పాజిటివ్.. ఇప్పుడు నెగిటివ్.. ‘జాతి రత్నాలు’ లో ఏముంది? అంటున్న నెటిజన్స్..

జోగిపేట్, శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం.. నేను రైస్ పెడతా మామా.. నేను కర్రీస్ తెస్తా మామా’.. ఈ డైలాగ్స్ ఆడియెన్స్‌ను విపరీతంగా నవ్వించాయి. ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ ప్రధాన పాత్రలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా, అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’.. మార్చి 11న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఊహించని కలెక్షన్లకు ట్రేడ్ వర్గాలవారు సైతం ఆశ్చర్యపోయారు..

Jathi Ratnalu : అప్పుడు పాజిటివ్.. ఇప్పుడు నెగిటివ్.. ‘జాతి రత్నాలు’ లో ఏముంది? అంటున్న నెటిజన్స్..

Jathi Ratnalu

Jathi Ratnalu: ‘జోగిపేట్, శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం.. నేను రైస్ పెడతా మామా.. నేను కర్రీస్ తెస్తా మామా’.. ఈ డైలాగ్స్ ఆడియెన్స్‌ను విపరీతంగా నవ్వించాయి. ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ ప్రధాన పాత్రలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా, అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’.. మార్చి 11న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఊహించని కలెక్షన్లకు ట్రేడ్ వర్గాలవారు సైతం ఆశ్చర్యపోయారు.

పాండమిక్ తర్వాత ఓవర్సీస్‌లో 1 మిలియన్‌కి పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. పెట్టినదానికి మూడు రెట్లకుపైగా వసూళ్లు రాబట్టి ట్రిబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, యూఎస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ‘జాతి రత్నాలు’ ఇటీవలే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. కట్ చేస్తే థియేటర్ రెస్పాన్స్‌ పాజిటివ్‌గా ఉంటే డిజటల్ రెస్పాన్స్ మాత్రం నెగెటివ్‌గా ఉంది.

సినిమా నచ్చలేదు, ఏముందని అంతలా ఎత్తారు, అసలు కంటెంట్ లేదు, ఓవర్ రేటెడ్ కామెడీ తప్ప’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లో జనాలమధ్య నవ్వులజల్లుల మధ్య సరాదాగా నవ్వుకుంటూ చూసిన సినిమా ఒంటరిగా ఓటీటీలో చూస్తే అంత కిక్ అనిపించకపోవచ్చు.. అయినా ఒక సినిమా అందరకీ నచ్చాలని రూలేం లేదు కదా.. నెగెటివ్ టాక్ చెప్పే వాళ్లు నిజంగా సినిమా బాగోలేకపోతే ఈ రేంజ్ కలెక్షన్స్ రావు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటూ మరికొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు.