‘మా కేసు మేమే వాదించుకుంటాం యువరానార్’…

‘మా కేసు మేమే వాదించుకుంటాం యువరానార్’…

Jathi Ratnalu Trailer: నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామక‌ృష్ణ మెయిన్ లీడ్స్‌గా..‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, స్వప్న సినిమాతో కలిసి నిర్మిస్తున్న ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’.. ఫరియా అబ్దుల్లా కథానాయిక..

Jathi Ratnalu

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, ముఖ్యంగా ‘చిట్టీ’ సాంగ్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ‘జాతిరత్నాలు’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు డార్లింగ్..

Jathi Ratnalu

నవీన్ పోలిశెట్టి నటనకి ఫిదా అవ్వాల్సిందే అనేంత చక్కగా పర్ఫామ్ చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ నవ్వులు పూయించగా.. చివర్లో తన ఫొటోతోనే కడుపుబ్బా నవ్వించే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది. ‘జాతి రత్నాలు’ మార్చి 11న థియేటర్లలోకి వస్తున్నారు.

Jathi Ratnalu