Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, తాజాగా ఈ సినిమాలో ఓ సీనియర్ నటి కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్..?

Jayasudha In Chiranjeevi Mega154 Movie

Chianjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో గాడ్‌ఫాదర్, భోళాశంకర్, మెగా154 సినిమాలు లైన్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల్లో మెగా 154 చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకు కారణం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండటం.

Mega154: మెగాస్టార్‌తో మాస్ చిందులు.. ఆ తరువాతే యాక్షన్..?

ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటించబోతుందట. మెగా154 చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ ఒకే తండ్రికి పుట్టిన సోదరులుగా కనిపించబోతున్నారట. అయితే చిరు సవతి తల్లి పాత్రలో సీనియర్ నటి జయసుధ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?

రవితేజ తల్లి పాత్రలో జయసుధ నటిస్తుండగా, ఆమె కోసం ఆరాటపడుతూ రవితేజ చిరుతో చేతులు కలుపుతాడు. అయితే వారిద్దరి దారులు వేరుకావడం, తల్లి కోసం రవితేజ చిరును ఎదురించడం లాంటి అంశాలు మనకు ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చిరు 154 సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.