JC Meets Raghuveera: రఘువీరారెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో భేటి అయ్యారు.

10TV Telugu News

JC Prabhakar Reddy Meets Raghuveera Reddy: అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో భేటి అయ్యారు. అయితే, తమ భేటి వెనుక రాజకీయమైన వ్యూహాలు ఏమీ లేవని, సీమ బిడ్డలు అందరూ ఏకతాటిపైకి వచ్చి జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకోసమే పలువురు అధికారులతో పాటు సీనియర్‌ నేతలను కలిసినట్లుగా ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారాయన.

ఈ క్రమంలోనే రఘువీరా రెడ్డిని కలిశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాజకీయాల్లో శత్రువులు, స్నేహితులు ఉంటారు. కానీ, పోరాటాలకు అవేమీ అడ్డుకావని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి. తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదన్న జేసీ.. రాయలసీమ నీటి కోసమే రఘువీరా రెడ్డిని కలిసినట్లు చెప్పారు. ఇప్పటికే మైసూరారెడ్డితోపాటు రాయలసీమలో చాలా మంది సీనియర్ నాయకులను, రిటైర్డ్ అధికారులను కలిసినట్లు తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

పార్టీ జెండాలు పక్కనబెట్టి అజెండాతో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగస్థులతో కలసి ముందుకు సాగుతున్నట్లు చెప్పారాయన. అందులో భాగంగానే రఘువీరా రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డి నిర్మించిన దేవాలయాలను దర్శించినట్లు చెప్పారు. రాయలసీమ నీటి విషయంలో చేయాల్సిన పోరాటంపై నిర్ణయించుకున్న అజెండా గురించి రఘువీరాకు వివరించారాయన. అంతా ఒక్క తాటిపైకి వచ్చి సీమ జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

10TV Telugu News