నితీష్ కి బిగ్ ఝలక్…బీజేపీలో చేరిన 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు

నితీష్ కి బిగ్ ఝలక్…బీజేపీలో చేరిన 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు

JD(U) suffers setback in Arunachal అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జేడీయూకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(PPA)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే కార్డో న్యైగ్యోర్ కూడా బీజేపీలో చేరారు. న్యైగ్యోర్…లికబాలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు ఇంతకుముందు..పార్టీ సీనియర్ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా తాలెమ్ తబోహ్ ని లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక్కరోజు ముందు ఈ పరిణామం అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ,పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో నవంబర్-26న ముగ్గురు ఎమ్మెల్యేలకు జేడీయూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా వారిని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. అదేవిధంగా పీపీఏ ఏకైక ఎమ్మెల్యే కూడా ఈ నెల ప్రారంభంలో తన పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు.

బీజేపీ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ..2019 అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసి 7 సీట్లలో విజయం సాధించింది. 41 స్థానాల్లో గెలిచిన బీజేపీ తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా జేడీయూ నిలిచింది. కాగా,ఇప్పుడు 6గురు జేడీయూ ఎమ్మెల్యేలు కాషాయపార్టీలోకి జంప్ అవడంతో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ బలం 48కి చేరింది. మొత్తం 60స్థానాల అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు జేడీయూకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలాడు. రాష్ట్రంలో కాంగ్రెస్,ఎన్ పీపీకి చెరో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.